”ఫ్యాన్స్‌కి షేక్ హ్యాండ్..ఆపై డెటాల్‌తో హ్యాండ్ వాష్”.. హీరో విజయ్‌పై సంచలన ఆరోపణలు

కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత..ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో విజయ్.  కెరీర్ బిగినింగ్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా..కొంత కాలంగా ఇళయదళపతి నటిస్తున్న సినిమాలు వరుస విజయాలతో దుమ్మురేపుతున్నాయి. దాంతో సహజంగానే అభిమానించడంలో ముందుండే అరవ ప్రేక్షకులు..విజయ్‌ని ఎంతగానో ఓన్ చేసుకున్నారు. కాగా రియల్ లైఫ్ లో కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రకృతి వైపరిత్యాల వచ్చిన తరుణంలో ఆర్థికంగా సహాయం చేస్తూ విజయ్ తన మంచి మనసును చాటుకుంటారు. అంతేకాదు […]

''ఫ్యాన్స్‌కి షేక్ హ్యాండ్..ఆపై డెటాల్‌తో హ్యాండ్ వాష్.. హీరో విజయ్‌పై సంచలన ఆరోపణలు
Ram Naramaneni

|

Oct 12, 2019 | 10:38 AM

కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత..ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో విజయ్.  కెరీర్ బిగినింగ్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా..కొంత కాలంగా ఇళయదళపతి నటిస్తున్న సినిమాలు వరుస విజయాలతో దుమ్మురేపుతున్నాయి. దాంతో సహజంగానే అభిమానించడంలో ముందుండే అరవ ప్రేక్షకులు..విజయ్‌ని ఎంతగానో ఓన్ చేసుకున్నారు. కాగా రియల్ లైఫ్ లో కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రకృతి వైపరిత్యాల వచ్చిన తరుణంలో ఆర్థికంగా సహాయం చేస్తూ విజయ్ తన మంచి మనసును చాటుకుంటారు. అంతేకాదు తన అభిమానులకు ఏదైనా అవసరం వస్తే వెంటనే స్పందిస్తాడు. వారికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తను స్వయంగా వెళ్లి వారి బాగోగులు తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి.
కానీ ఇదంతా విజయ్‌లోని ఒక యాంగిలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఓ తమిళ దర్శకుడు. అతడిలోని మరో యాంగిల్ చూస్తే షాక్ అవ్వడం ఖాయం అని అంటున్నాడు.  సామి అనే తమిళ దర్శకుడు మాట్లాడుతూ.. విజయ్ తన అభిమానుల విషయంలో కర్కశంగా వ్యవహరిస్తుంటారని, అందరూ అనుకున్నంత సౌమ్యుడు కాదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. విజయ్ తన అభిమానులపై చూపించే ప్రేమంతా నాటకమేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. బాక్సాఫీస్ లెక్కల కోసమే విజయ్ అలా ప్రేమను కురిపిస్తుంటాడని దానిని అభిమానులు నమ్మొద్దని వ్యాఖ్యానించారు.
అతడు అభిమానులకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెంటనే డెటాల్ తో తన చేతులు శుభ్రం చేసుకుటాడని, అభిమానులు ఆయనకు అంత నీచంగా కనిపిస్తుంటారని ఘాటు ఆరోపణలు చేశారు. ఈవెంట్స్ లో అనవసరమైన విషయాలు మాట్లాడతారని, అలాంటి మాటలు ఆయన తగ్గించుకోవాలని అన్నారు. అయితే సామి ఇలా విజయ్‌పై ఎందుకు కామెంట్స్ చేస్తున్నారన్న విషయం మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు. సామి ఇంతకుముందు ‘సింధు సామవేళి’ అనే కాంట్రవర్శియల్ సినిమాని తెరకెక్కించారు. పలు ప్రయోగాత్మక చిత్రాలతో ఆయన తమిళ ప్రేక్షకులకు సుపరిచితం. కాగా ఈ వ్యాఖ్యలపై ఇళయదళపతి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu