ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కలకలం రేపుతోంది. సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ రోజు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ లో నా జోక్యం ఏమీ ఉండదు, చట్టం ముందు అందరూ సమానులే. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని, అలాగే మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో అల్లు అర్జున్ నివాసానికి చిరంజీవి దంపతులు, నాగబాబు చేరుకున్నారు. అర్జున్ అరెస్ట్‌తో షూటింగ్ రద్దు చేసుకొని, హుటాహుటిన అర్జున్ నివాసానికి చిరంజీవి వెళ్లారు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ పరిణామాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఉదయం అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి ముందుగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం బన్నీని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ను తీసుకెళ్లారు. బన్నీ వెంటే అల్లు అరవింద్, అల్లు శిరీష్ సైతం పోలీస్ స్టేషన్ కు వెళ్లారు
#WATCH | Delhi: “Let me find out, then I will tell you,” says Telangana CM Revanth Reddy on the arrest of actor Allu Arjun by Hyderabad Police over the death of a woman in Sandhya theatre at the premiere of ‘Pushpa 2: The Rule’ pic.twitter.com/c9tprBJITA
— ANI (@ANI) December 13, 2024