జప్ఫా అంటూ హైపర్ ఆదికి రాకేశ్ మాస్ట‌ర్ వార్నింగ్…

జప్ఫా అంటూ హైపర్ ఆదికి రాకేశ్ మాస్ట‌ర్ వార్నింగ్...

జబర్దస్త్ కమెడియన్ హైప‌ర్ ఆది తన పంచ్‌లతో ఎంతో ఫేమ‌‌స్ అయ్యాడు. కేవ‌లం అత‌ని స్కిట్ కోసం జ‌బ‌ర్ద‌స్త్ చూసేవాళ్లు ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు. అయితే అత‌డు పాపులర్ పర్శనాలిటీలను ఇమిటేట్ చేసి.. వాళ్లపై పంచ్‌లు పేల్చ‌డంతో అనేక‌సార్లు అత‌న్ని వివాదాలు చుట్టుముట్టాయి. ఇటీవల కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ పై కూడా ఆది సెటైర్ వేశాడు. ఈ మధ్య‌కాలంలో సెల‌బ్రిటీల‌పై ఘాటు వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డుతోన్న రాకేశ్ మాస్ట‌ర్…త‌న‌పైనే పేరడీ చేయ‌డంతో ఆదిపై ఓ లెవ‌ల్ లో ఫైర‌య్యాడు. […]

Ram Naramaneni

|

May 04, 2020 | 8:15 PM

జబర్దస్త్ కమెడియన్ హైప‌ర్ ఆది తన పంచ్‌లతో ఎంతో ఫేమ‌‌స్ అయ్యాడు. కేవ‌లం అత‌ని స్కిట్ కోసం జ‌బ‌ర్ద‌స్త్ చూసేవాళ్లు ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు. అయితే అత‌డు పాపులర్ పర్శనాలిటీలను ఇమిటేట్ చేసి.. వాళ్లపై పంచ్‌లు పేల్చ‌డంతో అనేక‌సార్లు అత‌న్ని వివాదాలు చుట్టుముట్టాయి. ఇటీవల కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ పై కూడా ఆది సెటైర్ వేశాడు. ఈ మధ్య‌కాలంలో సెల‌బ్రిటీల‌పై ఘాటు వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డుతోన్న రాకేశ్ మాస్ట‌ర్…త‌న‌పైనే పేరడీ చేయ‌డంతో ఆదిపై ఓ లెవ‌ల్ లో ఫైర‌య్యాడు.

ఇటీవ‌ల త‌ను డ్యాన్స్ మాస్ట‌ర్ గా ఉన్న‌ప్పుడు ముఖంలో క్స్ ప్రెషన్స్ ఎలా ప‌లికించేవారు .. ఇప్పుడు ఎలా చూపిస్తున్నోరో డిఫ‌రెన్స్ చూపిస్తూ.. ‘చెల్లెమ్మకు పెళ్లంటా.. అన్నయ్య సంబరం అంట’ అంటూ రాకేష్ మాస్టర్ మాట్లాడిన వీడియో ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది. ఇక ఇలాంటి వాటిపై మ‌స్త్ ఫ‌న్ క్రియేట్ చేసే ఆది దాన్ని ఇటీవ‌ల జ‌రిగిన ‘పండగ సార్ పండగ అంతే’ అనే కార్యక్రమంలో సెటైరిక‌ల్ గా వాడేశాడు. త‌న‌కు సంబంధం లేని వ్య‌క్తులపైనే హాట్ వ్యాఖ్య‌లు చేసే రాకేశ్ మాస్ట‌ర్…త‌నమీదే పంచ్ వేసేస‌రికి ఆదికి ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చాడు. నాపైనే కామెడీ చేస్తావా..?..దొరుకుతావురా తుపాకీ.. అప్పుడు నీకు ఉంటుందిరా ఆదీ..అంటూ స్టైయిట్ వార్నింగ్ ఇచ్చాడు. మంచి మ‌న‌సు ఉండాల‌ని.. తాను భూతులు మాట్లాడినా..యోగి వేమ‌న ఉంటాడ‌ని…ఆది చేసేది క‌మ‌ర్షియ‌ల్ బిజినెస్ అని చెప్పుకొచ్చాడు. త్వ‌ర‌లోనే గొడ్డలిపెట్టు పడపోతుంది అంటూ ఆదికి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు రాకేష్ మాస్టర్.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu