Chiyan Vikram: కోబ్రా సినిమాకోసం విక్రమ్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వడం ఖాయం..

ఈ మధ్య కాలాల్లో హీరోల రెమ్యునరేషన్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. హీరోలు తీసుకుంటున్న భారీ రెమ్యునరేషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Chiyan Vikram: కోబ్రా సినిమాకోసం విక్రమ్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వడం ఖాయం..
Chiyaan Vikram
Follow us

| Edited By: Basha Shek

Updated on: Sep 01, 2022 | 1:21 PM

ఈ మధ్య కాలాల్లో హీరోల రెమ్యునరేషన్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. హీరోలు తీసుకుంటున్న భారీ రెమ్యునరేషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పాలనా హీరో అని కోట్లు తీసుకున్నాడు.. ఇన్ని కోట్లు తీసుకున్నాడు అంటూ ఎదో ఒక వార్త వినిపిస్తూనే వుంది. తాజాగా హీరో విక్రమ్(Chiyan Vikram) రెమ్యునరేషన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. విక్రమ్ పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. తమిళనాటే కాదు. తెలుగులోనూ విక్రమ్ కు మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇక విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ కోబ్రా. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా గ్రాండ్ గా విడుదలైంది. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా.. భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రతినాయకుడిగా నటించారు.

ఇక ఈ సినిమాలో విక్రమ్ చాలా గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కోసం విక్రమ్ తీసుకున్న రెమ్యునరేష్ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకోసం విక్రమ్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడట. విక్రమ్ కోబ్రా సినిమా కోసం అక్షరాలా రూ.25 కోట్లు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో విక్రమ్ పడ్డ కష్టం తెలిసిన నిర్మాత.. ఆయన అడిగినంత మొత్తాన్ని ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది.ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. ఇందులో విక్రమ్ గణిత శాస్త్రవేత్తగా కనిపించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి