Chiranjeevi: వందలాది మంది డాన్సర్లతో కలిసి స్టెప్పులేయనున్న మెగాస్టార్, సల్మాన్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రీమేక్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. వాటిలో లూసిఫర్ మూవీ రీమేక్ ఒకటి. ఈ రీమేక్ గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

Chiranjeevi: వందలాది మంది డాన్సర్లతో కలిసి స్టెప్పులేయనున్న మెగాస్టార్, సల్మాన్
Chiranjeevi, Salman Khan
Rajeev Rayala

|

Jun 28, 2022 | 10:57 AM

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ప్రస్తుతం రీమేక్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. వాటిలో లూసిఫర్ మూవీ రీమేక్ ఒకటి. ఈ రీమేక్ గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా బాలీవుడ్ స్టార్ హీరోసల్మాన్ ఖాన్(Salman khan) కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవలే స‌ల్మాన్ తన పార్ట్ ను పూర్తి చేశారు.  స‌ల్మాన్ ఈ మూవీలో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ను పోషిస్తున్నారు. చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌పై వచ్చే స‌న్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయ‌ని చిత్ర‌యూనిట్ చెబుతోంది. తెలుగులో స‌ల్మాన్‌ఖాన్ న‌టించ‌డం ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది. ఇలా మెగాస్టార్ చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌లు ఇద్ద‌రూ ఒకేచోట కనిపించ‌డం అభిమానుల‌కు పండుగే.. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త ఇప్పడు ఫిలిం సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో సల్మాన్ చిరంజీవి కలిసి ఒక పాటలో స్టెప్పులు కూడా వేయనున్నారట. చిరంజీవి, సల్మాన్ తో పాటు 700 మంది డాన్సర్లు ఈ పాటలో పాల్గొననున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ పాటను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటతో సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతుందట. ఇక ఈ మూవీలో నయనతార మెగాస్టార్ సిస్టర్ రోల్ లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 11న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాల తర్వాత వరుస ప్రాజెక్ట్స్ తో మెగాస్టార్ ఫుల్ బిజీ కానున్నారు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళాశంకర్ , బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరన్న సినిమాలు చేస్తున్నారు చిరు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu