సౌత్ డైరెక్టర్స్‌ను రమ్మంటూ..హీరోలను పొమ్మంటున్న బాలీవుడ్..!

సౌత్ డైరెక్టర్స్‌ను రమ్మంటూ..హీరోలను పొమ్మంటున్న బాలీవుడ్..!

ప్రజంట్ సౌత్ సినిమా ఇండస్ట్రీ ఓ స్థాయిని క్రియేట్ చేసుకోని దూసుకుపోతుంది. ఒకవైపు ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేసే మాస్ మసాలా మూవీలను కొనసాగిస్తూనే..మరివైపు సినిమా లవర్స్‌ను మెస్మరైజ్ చేసేలా యూనిక్ సబ్జెక్ట్స్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా యువ దర్శకులు సిల్వర్ స్రీన్‌పై మ్యాజిక్ చేస్తున్నారు. తక్కవ బడ్జెట్‌లో సినిమాలు తీసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలుకొడుతున్నారు. ఇప్పటివరకు ఇండియా వైజ్ రికార్డ్స్ అంటే అవి బాలీవుడ్ కోసమేగా అన్నట్టు ఉండేవి..కానీ ఇప్పడు సీన్ మారింది. బాహుబలి లాంటి సినిమాలతో సౌత్ […]

Ram Naramaneni

| Edited By:

Oct 16, 2019 | 4:07 PM

ప్రజంట్ సౌత్ సినిమా ఇండస్ట్రీ ఓ స్థాయిని క్రియేట్ చేసుకోని దూసుకుపోతుంది. ఒకవైపు ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేసే మాస్ మసాలా మూవీలను కొనసాగిస్తూనే..మరివైపు సినిమా లవర్స్‌ను మెస్మరైజ్ చేసేలా యూనిక్ సబ్జెక్ట్స్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా యువ దర్శకులు సిల్వర్ స్రీన్‌పై మ్యాజిక్ చేస్తున్నారు. తక్కవ బడ్జెట్‌లో సినిమాలు తీసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలుకొడుతున్నారు. ఇప్పటివరకు ఇండియా వైజ్ రికార్డ్స్ అంటే అవి బాలీవుడ్ కోసమేగా అన్నట్టు ఉండేవి..కానీ ఇప్పడు సీన్ మారింది. బాహుబలి లాంటి సినిమాలతో సౌత్ స్టామినా ప్రపంచానికి తెలిసింది. మరోవైపు కేజీఎఫ్, అర్జున్ రెడ్డి, జెర్సీ లాంటి..భిన్నమైన కథలు ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

ఇక బాలీవుడ్ తెలివిగా సౌత్ దర్మకులను ఇంపోర్ట్ చేసుకోవడం మొదలెట్టింది. ఇంతకాలం సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు సౌత్ సినిమాలను రీమేక్ చేసి హిట్ల మీద హిట్లు కొట్టారు. అక్షయ్ కుమార్ కూడా ఆ లిస్ట్‌లో ముందువరసలో ఉన్నాడు. ఇప్పుడు రీమేక్ సినిమాలే కాదు..మన దర్శకులు కూడా కావాలంటూ బాలీవుడ్ హీరోస్ తెగ ప్రాదేయపడుతున్నారు. ఇప్పటికే అక్కడ ప్రభుదేవా కొన్ని సినిమాలు తీసి డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్లాపులతో సతమతవవుతోన్న యంగ్ హీరో షాహిద్ కపూర్‌కి మన తెలుగు డైరెక్టర్ అయిన సందీప్ వంగాతో రీమేక్ సినిమా ‘కబీర్ సింగ్’ చేసి 100 కోట్ల భారీ హిట్ కొట్టాడు.  హిట్ ఫార్ములా తెలుసుకోని మరో తెలుగు మూవీ ‘ జెర్సీ’ ని ఒరిజినల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో రీమేక్ చేయబోతున్నాడు.

ఇక షాహిద్ కపూర్ ఫార్ములానే ఫాలే అవ్వబోతున్నాడు కింగ్ ఖాన్..షారుక్. బాలీవుడ్ బాద్షా షారుక్ గత కొంతకాలంగా హిట్ కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో అందరికి తెలిసిందే.  తమిళంలో వరుసగా హిట్ సినిమాలను తీస్తున్న దర్శకుడు అట్లీతో షారుక్ సినిమా చేయబోతున్నాడని అందరికి తెలిసిపోయింది. ఇక దేవా కట్టా ఇటీవలే ప్రస్థానం రీమేక్‌తో ఓ ట్రైల్ వేసి వచ్చాడు. ఇలా మన సౌత్ క్రియేటర్స్‌పై బాలీవుడ్ ఆధారపడటం మనం ఆనందపడే విషయమే.

అయితే సౌత్ డైరెక్టర్లను రా..రమ్మంటున్నారు కానీ..సౌత్ హీరోలంటే మాత్రం మోహం చాటేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ బాలీవుడ్‌లో హంగామా మొదలెట్టాడు. అక్కడి చాలామంది  హీరోల కంటే ఇప్పుడు ప్రభాస్‌కి మంచి మార్కెట్ ఏర్పడింది.బాహుబలి సినిమాతో బాలీవుడ్ లో తన రేంజ్ ఏంటో చూపించిన డార్లింగ్.. ‘సాహో’తో బీ టౌన్‌కి చుక్కలు చూపించాడు. సినిమాపై అక్కడి రివ్యూ రైటర్లు ఎంత నెగటీవ్ టాక్ క్రియేట్ చేసినా..సినిమా మాత్రం కలెక్షన్ల విషయంలో అందర్ని విస్మయానికి గురిచేసింది. డివైడ్ టాక్ వచ్చిన సినిమాకే ఈ రేంజ్‌లో ఉంటే..అదే మాంచి హిట్ పడితే మాత్రం పరిస్థితి వర్ణణాతీతం. అందుకేనేమో సౌత్ హీరోల సినిమాలను అక్కడివారు పెద్దగా ప్రమోట్ చెయ్యడం లేదు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu