Chhaava Movie: అందుకే ‘ఛావా’ సినిమాను రిజెక్ట్ చేశాను.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ విలన్
గతేడాది హిందీలో వచ్చిన ఛావా సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాలీవుడ్ రికార్డులను తుడిచిపెట్టేసింది. అయితే తాజాగా ఈ బ్లాక్ బస్టర్ మూవీ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ ఛావా. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో రష్మిక మందన్నా ఏసుబాయిగా మెప్పించింది. అలాగే కీలకమైన ఔరంగ జేబు పాత్రలో ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ ఖన్నా అద్దిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఛావా చిత్రం రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ అభినయం నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అతను తప్పితే మరొకరు ఈ పాత్రలో నటించలేరన్న విధంగా యాక్ట్ చేశాడు విక్కీ. ఇక ఆ తర్వాతి రోల్ ఔరంగ జేబు పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నాదే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అక్షయ్ క్రూరత్వాన్ని చూసి తిట్టుకోని వారుండరంటే అతి శయోక్తి కాదు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు అక్షయ్ ఖన్నా. అయితే ఔరంగ జేబు పాత్రకు ఫస్ట్ ఛాయిస్ అక్షయ్ ఖన్నా కాదట. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ రణ్ దీప్ హుడాను మొదట ఈ పాత్ర కోసం సంప్రదించారట. అయితే అతను రిజెక్ట్ చేయడంతో అక్షయ్ ఖన్నా లైన్ లోకి వచ్చాడట.
తాజాగా ఈ విషయం గురించి రణ్ దీప్ హుడా మాట్లాడుతూ.. ‘అప్పటికే నేను స్వతంత్య్ర వీర్ సావర్కర్ సినిమా కోసం బాగా బరువు తగ్గి సన్నబడ్డాను. ఆ సమయంలో ఔరంగజేబు పాత్ర కోసం నేను సరిపోతాననిపించలేదు. పైగా వీర్ సావర్కర్ సినిమా సంబంధించి ఓ కోర్టు కేసు కూడా ఎదుర్కొంటున్నాను. అదే సమయంలో ఛావా సినిమాలో హిందూ-ముస్లింకి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో మళ్లీ ఈ సినిమా కథలో ఇరుక్కుని మరిన్ని ఇబ్బందులు పడాలనుకోలేదు. ఆ దారిలో అసలు నడవాలనుకోలేదు’ అని రణ్ దీప్ హుడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా బాలీవుడ్ లో రణ్ దీప్ హుడాకు వెర్సటైల్ యాక్టర్ గా పేరుంది. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా, సహాయక నటుడిగానూ ఆకట్టుకుంటున్నాడు. ఆ మధ్యన టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన జాట్ సినిమాలో రణ్ దీప్ క్రూరమైన విలన్ పాత్రలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
రణ్ దీప్ హుడా లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




