Bigg Boss Season 7 Highlights: పిచ్చిదాన అంటూ.. రతిక పై అరిచిన శివాజీ.. రెట్టింపు ప్రతీకారం తీర్చుకున్న రతిక

నాగ్‌తో వీకెండ్ మస్తీ..! ఆ తరువాత ఎలిమినేషన్ టెన్‌క్షన్..! ఆ మరుసటి రోజు జరిగిన నామినేషన్స్ హీట్..! ఈ ఎపిసోడ్స్‌తో.. కంటెస్టెంట్స్ మధ్య జరిగిన వాడి వేడీ గొడవలతో.. గత రెండు రోజులుగా.. చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగిన బిగ్ బాస్ సీజన్ 7.. ఇవ్వాల మాత్రం కాస్త చప్పగా సాగింది. ఇక షో స్టార్ట్ అవగానే.. అప్పటికే బిగ్ బాస్ ఇచ్చిన మహాబలి వర్సెస్ రణధీర టాస్క్‌లో భాగంగా.. కంటెస్టెంట్స్ అందరూ గేమ్ ఆడే మూడ్‌లోనే ఉన్నారు. ఏ టీంకు ఆ టీం.. కీ చేజిక్కించుకునే ప్రయత్నాల్లో.. ప్రణాళికల్లో బిజీగానే గడిపారు. ఇక ఈ క్రమంలోనే కంటెంట్స్‌ అందరూ పడుకున్న వేళ.. స్టార్ సింగర్ దామిని.. శివాజీ టీం నుంచి కీ దొంగిలించడానికి ట్రై చేసింది.

Bigg Boss Season 7 Highlights: పిచ్చిదాన అంటూ.. రతిక పై అరిచిన శివాజీ.. రెట్టింపు ప్రతీకారం తీర్చుకున్న రతిక
Ratika Vs Shivaji
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Sep 14, 2023 | 10:03 AM

Bigg Boss Season 7: నాగ్‌తో వీకెండ్ మస్తీ..! ఆ తరువాత ఎలిమినేషన్ టెన్‌క్షన్..! ఆ మరుసటి రోజు జరిగిన నామినేషన్స్ హీట్..! ఈ ఎపిసోడ్స్‌తో.. కంటెస్టెంట్స్ మధ్య జరిగిన వాడి వేడీ గొడవలతో.. గత రెండు రోజులుగా.. చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగిన బిగ్ బాస్ సీజన్ 7.. ఇవ్వాల మాత్రం కాస్త చప్పగా సాగింది. ఇక షో స్టార్ట్ అవగానే.. అప్పటికే బిగ్ బాస్ ఇచ్చిన మహాబలి వర్సెస్ రణధీర టాస్క్‌లో భాగంగా.. కంటెస్టెంట్స్ అందరూ గేమ్ ఆడే మూడ్‌లోనే ఉన్నారు. ఏ టీంకు ఆ టీం.. కీ చేజిక్కించుకునే ప్రయత్నాల్లో.. ప్రణాళికల్లో బిజీగానే గడిపారు. ఇక ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ అందరూ పడుకున్న వేళ.. స్టార్ సింగర్ దామిని.. శివాజీ టీం నుంచి కీ దొంగిలించడానికి ట్రై చేసింది. అయితే ఇది గమనించిన శివాజీ.. మరో సారి తన స్టైల్లో పంచ్ డైలాగులు విసిరారు శివాజీ దగ్గర నుంచి కొట్టేయలేరంటూ.. డైలాగులు చెప్పారు. కానీ అంతలోనే.. తన నిద్రలోకి జారాక.. రతిక కూడా.. శివాజీ నుంచి కీ కొట్టేసే ప్రయత్నం చేశారు. దీంతో .. నిద్ర నుంచి మేల్కొన్న శివాజీ.. పిచ్చి దానా అంటూ.. రతిక పై సీరియస్ అయ్యారు.

ఇక 10 రోజు.. రణ్‌వీర్ సింగ్ బాజీరామ్ మస్తానీ సాంగ్‌తో మేల్కొన్న కంటెస్టెంట్స్ వీర లెవల్లో తమ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూపించారు. చాలా జోష్‌గా డేను స్టార్ చేశారు. ఇక మళ్లీ మహాబలి వర్సెస్ రణధీర ఆడడం షురూ చేసిన కంటెస్టెంట్స్.. మళ్లీ ఒక టీం దగ్గర నుంచి.. మరో టీం.. కీ ని లాక్కునే ప్రయత్నాలు మొదలెట్టారు. ఇక అందులో బాగంగానే.. తన దగ్గర కీ కోసం తెగ ప్రయత్నిస్తున్న రతికు ఓ హింట్ ఇచ్చాడు. “మేఘాలు కమ్మినై.. చినుకులు రాలుతున్నై.. దాని చుట్టూ ఓ కంచె ఉంది. ఆ కంచె రంగురంగులతో.. వెలిగిపోతుంది. అప్పుడే వచ్చింది ఓ గోరింక. ఆ గోరింక పెట్టిన గూడులో.. ఆ కీ ఉంది” అని ఓ కథ చెప్పాడు. అర్థమైతే.. వెళ్లి కీ తీసుకో అంటూ.. రతికి ఛాలెంజ్ చేశాడు శివాజీ.

“అస్త్రం పొందే క్రమంలో.. రెండు సమూహాలు రెండో ఛాలెంజ్‌.. ‘మలుపులో ఉంది గెలుపు’.. ఈ ఛాలెంజ్ గెలవడానికి తమను తాము ఫ్లెక్స్ బుల్ గా ఉంటూ..బ్యాలెన్స్ చేస్తూ.. స్టేబుల్గా ఆటను ఆడాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా.. ఒక సమూహం నుంచి ఒక పోటీదారుడు.. మరొక సమూహం నుంచి ఒక పోటీదారుడు ఒకరితో ఒకరు తలపడాల్సి ఉంటుంది. సంచాలకుడు స్పిన్ వీల్ స్పిన్ చేసి.. ప్రతీ సారి ఇద్దరు పోటీదారులు.. స్పిన్లో వీల్లో సూచించిన విధంగా.. తమ కాళ్లు లేదా చేతులను.. అందుకు సంబంధించిన రంగుపై పెట్టాల్సి ఉంటుంది. ఇలా చేయడంలో విఫలం అయిన పోటీదారులు.. ఆ రౌండ్లో ఓడిపోయినట్టు. ఇలా మూడు రౌండ్స్ లో ఎక్కువ రౌండ్స్ గెలిచిన సమూహం.. ఈ ఛాలెంజ్లో గెలుపొందుతారు. గెలిచిన సమూహానికి మాయాస్త్రానికి సంబంధించిన కీ దక్కుతుంది.”అంటూ.. బిగ్ బాస్ పంపిన టాస్క్‌ చదివిన ఆట సందీప్ ప్పిన్ గేమ్‌ను స్టార్ట్ చేస్తాడు. కానీ గేమ్లో శివాజీ, ప్రియాంక, అమర్ దీప్ కీ రోల్స్ ప్లే చేసిన రణధీర గెలుపొందుతారు. కానీ స్పిన్ వీల్ గేమ్ ఓ పక్క జరుగుతున్న క్రమంలోనే.. రతిక శివాజీ పై ప్రతీకారం తీర్చుకుంది. రణధీర టీం దక్కించుకున్న కీ ను.. దొంగిలించింది. ఇదొక్కటే కాదు.. మహాబలి టీంలో ఉన్న రతిక టీం.. సందీప్ పవరాస్త్రను కూడా కొట్టేశారు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ .. కంటెస్టెంట్స్ అందరికీ చెప్పుకోండి చూద్దాం అంటూ.. ఓ చిన్న చమక్కు విసిరారు. కడుపుకు అన్నం ఎలాగో.. మీ మెదడుకు మేత అంటూ.. ఓ పొడుపు కథను అడిగారు. సప్తసముద్రాలు దాటిన వీరుడైనా.. ఆదమరిస్తే పిల్ల కాలువలో మునగాల్సిందే..! ఆ వీరుడెవరు? మునిగిందెవరు? ముంచిందెవరు? చెప్పుకోండి చూద్దాం అంటూ.. కంటెస్టెంట్స్‌ను అడిగారు బిగ్ బాస్. అయితే సందీప్ పోగొట్టుకున్న పవరాస్త్ర గురించే బిగ్ బాస్ అడుగుతున్నారని.. ఆ పవరాస్త్రను కొట్టేని మహాబలి టీం మరోపక్క నవ్వుకుంటూ ఎంజాయ్ చేశారు.

కట్ చేస్తే.. కండల వీరుడు యావర్‌కు.. బిగ్ పంచ్ ఇచ్చారు బిగ్ బాస్. తెలుగు బిగ్ బాస్ షోలో.. తెలుగు తప్ప హిందీ, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని.. తోటి కంటెస్టెంట్స్ సరిచేయాల్సింది పోయి.. వారు కూడా తనతో హిందీలో.. ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారని.. అలా చేయకుండా ఉండేందుకు ఈ చిన్న శిక్ష అంటూ.. ఓ నోట్ పంపించారు. “నేను ప్రిన్స్ యావర్‌ను తెలుగు కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాట్లాడినందుకు.. బిగ్ బాస్‌ను హృదయ పూర్వకంగా క్షమాపణ కోరుకుంటున్నాను. ఇక నుంచి బిగ్ బాస్ ఇంట్లో ఉన్నంత కాలం కేవలం తెలుగులోనే మాట్లాడతాను..” అని గార్డెన్ ఏరియాలో ఉన్న బిగ్ బాస్ పేరు ముందు.. బిగ్ బాస్ నుంచి తదుపరి ఆదేశం వచ్చే వరకు చెప్పాలని యావర్‌ను ఆ నోట్‌ ద్వారా ఆదేశించాడు బిగ్ బాస్.

అయితే యావర్ బిగ్ బాస్‌కు క్షమాపణ చెబుతుండగా..తేజు యవార్‌ను టచ్ చేస్తూ.. డిస్టబ్ చేశాడు. దీంతో ఆ పక్కనే ఉన్న శివాజీ.. మనిషిన టచ్ చేయొద్దు అంటూ తేజు పై సీరియస్ అయ్యాడు. ఇది ఫేర్ గేమ్ కాదని.. లిమిట్స్ క్రాస్ అవ్వొద్దని తేజును వారించాడు. అయినా తేజు అలాగే చేయడంతో.. బిగ్ బాస్‌ను రిక్వెస్ట్ చేసి మరీ.. శివాజీ వైలెంట్ అవతార్‌లోకి ట్రాన్స్ ఫాం అవుతాడు. గార్డెన్ ఏరియాల్లో ఉన్న డంబెల్స్‌ను.. వెయిట్స్ ను విసిరేస్తూ.. కాస్త హడావిడి చేశాడు శివాజీ. కానీ ఈ లోగా.. యావర్‌ ను బిగ్ బాస్ క్షమించడంతో.. 10 వ రోజు టాస్క్‌ ముగిసింది. ఇక ఈ టాస్క్‌ లో విజయం సాధించిన రణధీర సమూహాన్ని బిగ్ బాస్ అభినందించాడు. తమ దగ్గరున్న కీస్‌ తీసుకుని యాక్టివిటీ ఏరియాకు రమ్మని రణధీర టీంను ఆదేశిస్తాడు. కానీ అప్పటికే యాక్టివిటీ ఏరియాలో.. ఓ అద్భుతమైన యామాలోకాన్ని సెట్ చేసి.. కంటెస్టెంట్స్‌ ను అరిపించేస్తాడు.

అంతలోనే మాయాస్త్రం ద్వారపాలకుడు.. రణధీర సమూహాన్ని అభినందించి.. వారి దగ్గర ఉన్న రెండు కీలతో.. మాయాస్త్రాన్ని వెలికితీయమని ఆదేశిస్తాడు. బయటికి వచ్చిన మాయాస్త్రంలో తలో ముక్కను తీసుకోమని చెబుతాడు. పవరాస్త్ర కోసం పోటీ పడే కంటెస్టెంట్స్ మీ ఆరుగురి నుంచే వస్తారని.. మరిచిపోవద్దంటూ.. ద్వారపాలకుడు చెప్పడంతో..ఈ రోజు ఎపిసోడ్ అంటే.. సెప్టెంబర్ 14 బుధవారం నాటి ఎపిసోడ్ ముగుస్తుంది.

– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..