Bigg Boss 6: అదిరిందబ్బా..! ఆదిరెడ్డి.. గుడ్డు జాగ్రత్త టాస్క్‌లో వెరీ గుడ్ అనిపించుకున్న కామన్‌మెన్

ఎపిసోడ్స్ వారీగా చూపిస్తున్న టాస్క్ లలో నిన్న టికెట్ టు ఫినాలే’లో రెండు టాస్క్‌లు చూపించారు. వాటిలో ‘గుడ్డు జాగ్రత్త’ టాస్క్ ఒకటి. అయితే ఈ టాస్క్ లో ముగ్గురు మాత్రమే పాల్గొనాలి.

Bigg Boss 6: అదిరిందబ్బా..! ఆదిరెడ్డి.. గుడ్డు జాగ్రత్త టాస్క్‌లో వెరీ గుడ్ అనిపించుకున్న కామన్‌మెన్
Bigg Boss
Follow us

| Edited By: Phani CH

Updated on: Dec 02, 2022 | 10:11 AM

టికెట్ టు ఫినాలే పోటీ రసవత్తరంగా సాగుతోంది. టికెట్ టు ఫినాలే కోసం హౌస్ లో ఉన్న వారంతా పోటాపోడీగా టాస్క్ లు ఆడుతున్నారు. అయితే ఈ టాస్క్‌ను ప్రస్తుతం ప్రేక్షకులకు ఎపిసోడ్‌ల వారీగా చూపిస్తున్నారు. కానీ ఆది రెడ్డి టికెట్ టు ఫినాలేలో విన్నర్ గా నిలిచాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఎపిసోడ్స్ వారీగా చూపిస్తున్న టాస్క్ లలో నిన్న టికెట్ టు ఫినాలే’లో రెండు టాస్క్‌లు చూపించారు. వాటిలో ‘గుడ్డు జాగ్రత్త’ టాస్క్ ఒకటి. అయితే ఈ టాస్క్ లో ముగ్గురు మాత్రమే పాల్గొనాలి. ఆ ముగ్గురు ఎవరు అనేది హౌస్ లో ఉన్నవారు ఏకాభిప్రాయంతో నిర్ణయించాలని సూచించాడు బిగ్ బాస్. దాంతో వీరిలో రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్‌ లను ఫిక్స్ చేశారు హౌస్ మేట్స్. ఈ టాస్క్ లో పోటీదారులకు ఫ్లాట్‌గా ఉన్న బేస్‌లను ఇచ్చారు. దాని మీద గుడ్డు పెట్టి.. గుడ్డును పట్టుకోకుండా బేస్‌ను మాత్రమే ఒక చేత్తో పట్టుకుని అడ్డంకులన్నింటినీ దాటుకొని వెళ్లి ఆ గుడ్డును గూడులో వేయాలని తెలిపాడు. అలా 5 గుడ్లు ఎవరైతే గూడులో ఫస్ట్  వేస్తారో వారికి 3 పాయింట్లు. సెకండ్ వచ్చిన వారికి 2 పాయింట్లు. లాస్ట్ లో ఉన్నవారికి ఒక పాయింట్ వస్తుందని చెప్పాడు. సంచాలకులుగా ఇనయ, కీర్తి, శ్రీసత్య ఉన్నారు.

బజర్ మోగిన వెంటనే రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్ గేమ్ మొదలుపెట్టారు. అయితే, రేవంత్ బేస్ మీద గుడ్డు పెట్టి అడ్డంకులను దాటుకుంటూ వెళ్లే సమయంలో రేవంత్ ఆవేశంతో గుడ్లను కిందపడేసుకున్నాడు. అయితే మధ్యలో గుడ్డును పట్టుకోవడానికి కూడా ట్రై చేశాడు. కానీ ఆది రెడ్డి చాలా చాకచక్యంగా ఈ టాస్క్ ను పూర్తి చేశాడు. దాంతో అతను విన్నర్ అయ్యాడు. ఆ తరవాత రోహిత్ రెండో స్థానంలో.. రేవంత్ మూడో స్థానంలో నిలిచారు.

ఇవి కూడా చదవండి

ఇక ఓడిపోయినా తర్వాత రేవంత్ మళ్లీ కోపంతో ఊగిపోయాడు. సంచలక్ ను తప్పుపడుతూ సీరియస్ అయ్యాడు. నేను ఒక్క సారే గుడ్డు పట్టుకున్నా.. కానీ పదే పదే పట్టుకున్నా అంటూ సంచలక్ చెప్పింది అని శ్రీ సత్య దగ్గర చెప్పాడు. కీర్తి కావాలనే తనను టార్గెట్ చేసినట్టు మాట్లాడాడు రేవంత్.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!