Akhanda: అఖండ నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న బాలయ్య – ప్రగ్యా జైస్వాల్ జోడీ..

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది.

Akhanda: అఖండ నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న బాలయ్య - ప్రగ్యా జైస్వాల్ జోడీ..
Akhanda
Follow us

|

Updated on: Sep 19, 2021 | 7:38 AM

Akhanda : నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. గతంలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ విజయాలు దక్కించుకోవడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. బోయపాటికి కూడా అభిమానుల అంచనాలు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన  ఈ సినిమా ట్రీజర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాకూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతుంది. అలాగే ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్ సింగిల్ ‘అడిగా అడిగా’ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. అందమైన ఈ మెలోడీ శ్రోతలను ఆకట్టుకుంటుంది.

ఎస్.ఎస్ థమన్ ట్యూన్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ ఆకట్టుకుంటుంది. ‘అడిగా అడిగా.. పంచ ప్రాణాలు నీ రాణిగా.. అంటూ సాగే ఈ పాటను ఎస్పీ చరణ్ -ఎంఎల్ శృతి కలసి అద్భుతంగా ఆలపించారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు – శ్రీకాంత్ – పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే అఖండను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Bigg Boss 5 Telugu: అమ్మబాబోయ్ ఇంత డ్రామా ఆడిందా.. వీడియో ప్లే చేసి మరీ సిరి బండారం బయటపెట్టిన నాగార్జున..

Love Story: పొలాండ్‌ కుర్రాడి నోట లవ్‌ స్టోరీ పాట.. కుర్రాడి డెడికేషన్‌కు ఫిదా అవ్వాల్సిందే.

Samantha Fan Tattoo: సమంత నా ఫస్ట్ లవ్ అంటూ అభిమాని చేతిపై టాటూ తో ఫోటోలు విడుదల…

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ చూడండి.. 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ చూడండి..