Bandla Ganesh: నా జీవితానికి ఒక నటుడిగా ఇది చాలు అనుకున్నాను.. బండ్ల గణేష్ ఆసక్తికర కామెంట్స్..

డేగల బాబ్జీ' ఈ సినిమా గురించి ఇప్పటికే ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. తమిళ్ లో నేషనల్ అవార్డ్ పొందిన "ఉత్త సిరుప్పు సైజు 7

Bandla Ganesh: నా జీవితానికి ఒక నటుడిగా ఇది చాలు అనుకున్నాను.. బండ్ల గణేష్ ఆసక్తికర కామెంట్స్..
Bandla Ganesh
Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Feb 04, 2022 | 8:34 AM

‘డేగల బాబ్జీ’ ఈ సినిమా గురించి ఇప్పటికే ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. తమిళ్ లో నేషనల్ అవార్డ్ పొందిన “ఉత్త సిరుప్పు సైజు 7″(Oththa Seruppu Size 7) చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్( Bandla Ganesh) ను హీరోగా పరిచయం చేస్తూ తీసున్న చిత్రమే ‘డేగల బాబ్జీ'(Degala Babji). వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రాన్ని. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను బ్లాక్‌బ‌స్ట‌ర్‌ డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.అలాగే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేసిన ట్రైలర్ సైతం ప్రేక్షకులనుండి ఎంతో ఆధరణ లభించింది.ఇప్పుడు ఈ చిత్రం లోని లిరికల్ వీడియో ను బండ్ల గణేష్ కూతురు ద్రిష్టి విడుదల చేసారు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సపోర్ట్ చేస్తూ ట్రైలర్, పోస్టర్ ను విడుదల చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి,హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. తమిళ్ లో పార్థీబన్ చేసిన “ఉత్త సిరుప్పు సైజు 7” నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమాను తీసుకున్నాను అని నా మిత్రుడు వెంకట్ చంద్ర చెప్పడం జరిగింది.తనతో నాకు 20 సంవత్సరాల స్నేహం. తెలుగులో స్టార్ హీరోలు ఎవరు చేసినా కూడా ఈ సినిమా చాలా బాగుంటుంది అనుకున్నాను. అయితే అనూహ్యంగా ఈ సినిమాలో నన్ను నటించమని చెపితే..నేను యాక్ట్ చేయడమేమిటి..నేను యాక్టింగ్ మర్చిపోయాను. తమిళ్ లో పార్థీబన్ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేసిన తను ఎక్కడ.. నేనెక్కడ.. నేను చేయలేను.. అయినా నేనిప్పుడు సినిమా తీద్దామను కుంటున్నాను యాక్ట్ చేయనని చెప్పాను .అయితే కథ చాలా బాగుందని చెబుతూ నన్ను కన్విన్స్ చేయడంతో.. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.

ఒక రూమ్ లో ఒక సినిమాని రెండు గంటల సేపు ఒక క్యారెక్టర్ చేయడం అనేది చాలా రిస్క్. అలాంటి కథను నా భుజాన పెట్టి నాతో చేయించాడు అన్నారు. సినిమా చేసే వరకు నాలో గుండె దడ దడ కొట్టుకునేది, భయమేసేది. సినిమా చేసే క్రమంలో నేను చేయగలననే ధైర్యం వచ్చింది. సినిమా అయిపోయిన తర్వాత చూసుకున్న నేనే అక్షర్యపోయాను. నేనేనా ఇలా యాక్ట్ చేసింది అని నాలో నాకే ఆనందంవేసింది. నా జీవితానికి ఒక నటుడిగా ఇది చాలు అనుకున్నాను. పవన్ కళ్యాణ్ తో “గబ్బర్ సింగ్” సినిమా తీసినప్పుడు ఎంత హాయిగా కాలరెగరేసి తృప్తిగా ఉన్నానో..నేను చచ్చిపోయిన తరువాత కూడా గబ్బర్ సింగ్ నిర్మాత అనే గర్వం ఎలా ఉంటుందో. ఈ “డేగల బాబ్జి” చిత్రం కూడా నాకు అంత తృప్తినిచ్చింది అన్నారు బండ్ల .

మరిన్ని ఇక్కడ చదవండి : 

FIR Trailer: అమాయకుడి జీవితాన్ని తలకిందులు చేసిన అనుమానం.. ఆసక్తికరంగా ఎఫ్‌ఐఆర్‌ ట్రైలర్‌..

Childhood Pic:ఈ ఫోటో ఆ పాత మధురం.. అమ్మగా, బామ్మగా సిని ప్రేక్షకులకు సుపరిచితం.. ఎవరో గుర్తు పట్టరా..

Vaishnav Tej: మెగా హీరో సినిమా నుంచి మరో అప్డేట్‌.. అలరిస్తోన్న రంగ రంగ వైభవంగా మెలోడీ సాంగ్‌..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu