Balakrishna: అన్‌స్టాపబుల్ తర్వాత బాలయ్య మరో డేర్ స్టెప్.. అదేటంటే..

బాలయ్య డిజిటల్ ఎంట్రీ ఇవ్వడమే ఒక వండర్. టాక్‌షో నిర్వహించడం మరో వండర్. వాటన్నిటికీ మించి మరో అద్భుతానికి తెరతియ్యబోతున్నారు నందమూరి నటసింహం...

Balakrishna: అన్‌స్టాపబుల్ తర్వాత బాలయ్య మరో డేర్ స్టెప్.. అదేటంటే..
Balakrishna
Follow us

|

Updated on: Nov 28, 2021 | 8:38 AM

బాలయ్య డిజిటల్ ఎంట్రీ ఇవ్వడమే ఒక వండర్. టాక్‌షో నిర్వహించడం మరో వండర్. వాటన్నిటికీ మించి మరో అద్భుతానికి తెరతియ్యబోతున్నారు నందమూరి నటసింహం. త్వరలో డెవోషనల్ ప్రోగ్రామ్‌ చెయ్యబోతున్నారు ఎన్‌బీకే. అన్‌స్టాపబుల్ పేరుతో మెయిడెన్ టాక్‌ షోతో ఇప్పటికే అదుర్స్ అనిపిస్తున్నారు బాలయ్య. రెండు ఎపిసోడ్స్ సక్సెస్ అయ్యాయి. థర్డ్ ఎపిసోడ్‌ కూడా షూటింగ్ షురూ చేశారు. గెస్ట్ ఎవరన్న చర్చ అటువైపు జరుగుతుండగానే మరో బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు బాలయ్య.

అన్‌స్టాపబుల్ తర్వాత ఆహా ఓటీటీలోనే మరో ప్రోగ్రామ్‌తో ఫిదా చెయ్యబోతున్నారు బాలయ్య. భక్తి సంబంధిత కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నాం… త్వరలో వివరాలు చెబుతా అన్నారు నటసింహం. అఖండ ప్రిరిలీజ్ ఈవెంట్‌లో బన్నీ సమక్షంలో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు ఎన్‌బీకే. పౌరాణిక పద్యాల్ని, మంత్రాల్ని మంచి స్పాంటేనియటీతో చెప్పే బాలయ్య… అదే టాలెంట్‌ని డెవోషనల్ ప్రోగ్రామ్‌ ద్వారా డిజిటల్ ఆడియన్స్‌కి ఇవ్వబోతున్నారన్నమాట. బాలయ్య అఖండ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

-Srihari, ET, TV9 Telugu

Read  Also.. బాలయ్య యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిలాల్ల్సిందే.. అఖండలో నటసింహం విశ్వరూపం చూపించనున్నారట..