Tollywood: ఈ ఏడాది ఆ ముగ్గురు హీరోల మీదే ప్రేక్షకుల ప్రత్యేక దృష్టి.. ఎందుకంటే

2022లో బిగ్ హిట్స్‌తో అలరించిన స్టార్ హీరోలు హీరోలు ఈ ఇయర్‌లో బౌండరీస్‌ను మరింతగా పుష్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టి.. ఆడియన్స్‌లో హైప్‌ పెంచేస్తున్నారు.

Tollywood: ఈ ఏడాది ఆ ముగ్గురు హీరోల మీదే ప్రేక్షకుల ప్రత్యేక దృష్టి.. ఎందుకంటే
Tollywood
Follow us

|

Updated on: Jan 30, 2023 | 11:12 AM

మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌ లిస్ట్‌లో బడా హీరోలదే మేజర్‌ షేర్‌. 2022లో బిగ్ హిట్స్‌తో అలరించిన స్టార్ హీరోలు హీరోలు ఈ ఇయర్‌లో బౌండరీస్‌ను మరింతగా పుష్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టి.. ఆడియన్స్‌లో హైప్‌ పెంచేస్తున్నారు. 2021కు బిగ్ హిట్‌తో సెండాఫ్ ఇచ్చారు ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌. డిసెంబర్‌లో రిలీజ్ అయిన పుష్ప జోరు… మిడ్ 2022 వరకు కంటిన్యూ అయ్యింది. సోషల్ మీడియాలో అయితే ఇప్పటికీ మోస్ట్ హ్యాపెనింగ్ మూవీగా ఉంది పుష్ప. పుష్ప పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌ కావటంతో పుష్ప 2 మీద నేషనల్ లెవల్‌లో క్రేజీ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగా కథా కథనాలను మరింత భారీగా ప్లాన్ చేస్తోంది పుష్ప టీమ్‌. రీసెంట్‌గా సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం గ్లోబల్ ఆడియన్స్‌ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ కూడా ఈ సినిమా విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. అందుకే మరో సినిమాకు కమిట్ అవ్వకుండా ఫుల్ ఫోకస్‌ పుష్ప సీక్వెల్ మీదే పెట్టారు. బన్నీ ఇంత కాన్సన్‌ట్రేటెడ్‌గా ఉండటంతో అభిమానుల్లోనూ అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. ఇక వరుస బ్లాక్ బస్టర్స్‌తో అలరిస్తున్న మహేష్, అప్‌ కమింగ్ సినిమాల మీద భారీ హైప్‌ క్రియేట్ అవుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమా కోసం ఆడియన్స్‌ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలో మహేష్‌కు స్పెషల్ ఇమేజ్‌ క్రియేట్ చేశాయి. అందుకే నెక్ట్స్ మూవీలో మహేష్‌ను ఎలా ప్రజెంట్ చేయబోతున్నారన్న క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.

ఇప్పట్లో సెట్స్ మీదకు వచ్చే ఛాన్స్ లేకపోయినా… మహేష్, రాజమౌళి కాంబో కూడా మోస్ట్ అవెయిటెడ్ లిస్ట్‌లో ట్రెండ్ అవుతుంది. ఆల్రెడీ గ్లోబల్ మూవీ.. మహేష్‌ను హాలీవుడ్ రేంజ్‌లో చూపిస్తారంటూ ఊరిస్తోంది జక్కన్న టీమ్‌. దీంతో ఈ కాంబినేషన్‌ కోసం ఇప్పటి నుంచే వెయిటింగ్‌లో ఉంది సూపర్ స్టార్‌ సైన్యం. ఒక్కో సినిమాకు లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నా.. పవన్ సినిమాల మీద హైప్‌ మాత్రం తగ్గటం లేదు. ఈ ఏడాది భీమ్లా నాయక్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పవర్‌ స్టార్‌… నెక్ట్స్ హరి హర వీరమల్లు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్‌ పవన్‌ కాస్ట్యూమ్‌ డ్రామాగా చేస్తుండటంతో.. పీరియాడిక్‌ లుక్‌లో పవన్‌ను చూసేందుకు ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

తాజాగా సుజిత్ సినిమాతో మోస్ట్ అవెయిటెడ్ లిస్ట్‌లోకి మరో మూవీని తీసుకువచ్చారు పవర్ స్టార్‌. సాహో సినిమాతో ప్రభాస్‌ను మోస్ట్ స్టైలిష్ డాన్‌గా ప్రజెంట్ చేసిన సుజిత్‌.. లాంగ్ గ్యాప్ తరువాత పవన్‌ తో సినిమా చేస్తున్నారు. దీంతో పవర్‌ స్టార్‌ను కూడా మరో లెవల్‌లో తెర మీద చూపిస్తారన్న నమ్మకంతో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. పవన్‌ లిస్ట్‌లో ఊరిస్తున్న మరో మూవీ భవదీయుడు భగత్ సింగ్‌. గబ్బర్‌ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంబినేషన్‌ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమా మీద అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో మోస్ట్ అవెయిటెడ్ లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉంది భవదీయుడు భగత్ సింగ్‌.

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.