Rashmika Mandanna- Pooja Hegde: టాలీవుడ్‌లో సినిమాలు తగ్గించారా..? లేక అవకాశాలు సన్నగిల్లాయా.?

తెలుగులో ఇప్పుడు అగ్ర హీరోయిన్ హోదా తీసుకునే హీరోయిన్ ఒక్కరు కూడా లేరు.. కొత్త హీరోయిన్లు ఆ హోదాకు సరిపోరు.. ఉన్న హీరోయిన్లు పాతబడిపోయారు.

Rashmika Mandanna- Pooja Hegde: టాలీవుడ్‌లో సినిమాలు తగ్గించారా..? లేక అవకాశాలు సన్నగిల్లాయా.?
Pooja Hegde Rashmika Mandan
Follow us

|

Updated on: Jan 29, 2023 | 9:51 AM

టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు..? ఈ ప్రశ్న అడిగేముందు.. అసలు తెలుగులో టాప్ హీరోయిన్స్ ఉన్నారా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే నెంబర్ 1 అనుకుంటున్న భామ చేతిలో ఉన్నది ఒక్క సినిమానే.. నెంబర్ 2 కాస్తా బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయారు. మరి ఈ లెక్కన టాలీవుడ్ పరిస్థితేంటి..? తెలుగు ఇండస్ట్రీలో ఈ హీరోయిన్స్ కొరత తీరేదెప్పుడు..? తెలుగులో ఇప్పుడు అగ్ర హీరోయిన్ హోదా తీసుకునే హీరోయిన్ ఒక్కరు కూడా లేరు.. కొత్త హీరోయిన్లు ఆ హోదాకు సరిపోరు.. ఉన్న హీరోయిన్లు పాతబడిపోయారు. దాంతో దర్శక నిర్మాతలకు చుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి. నిన్నటి వరకు నెంబర్ వన్ అనుకున్న పూజా హెగ్డేకు మహేష్ బాబు సినిమా తప్ప మరో ఆఫర్ లేదు. విజయ్ దేవరకొండతో కమిటైన జనగణమన ఆదిలోనే ఆగిపోయింది.

బాలీవుడ్‌లో సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కా జాన్ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నారు పూజా. తెలుగులో ఒక్క సినిమా మాత్రమే చేస్తున్న పూజా హెగ్డేను నెంబర్ వన్ అనలేం. ఇక రష్మిక మందన్న సైతం టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చేసారు. పుష్ప 2 మినహా.. ఈమె తెలుగులో మరే సినిమా చేయట్లేదు. రష్మిక చూపులన్నీ బాలీవుడ్‌పైనే ఉన్నాయి. అక్కడే వరస సినిమాలు చేస్తున్నారు. దాంతో రష్మిక రేసులోంచి బయటికి వచ్చేసారు.

రష్మిక మందన్నకు టాలీవుడ్ మాత్రమే కాదు.. సౌత్ కూడా కనిపించడం లేదు. ఈమె చూపులన్నీ బాలీవుడ్‌పైనే ఉన్నాయి. పుష్ప సీక్వెల్ కాబట్టి ఆప్షన్ లేక కంటిన్యూ అవుతున్నారు రష్మిక. అలాగే విజయ్‌ తన ఫేవరేట్ హీరో కాబట్టి వారసుడులో నటించడానికి ఒప్పుకున్నారు. ఇవి మినహా ఈ మధ్య రష్మిక టాలీవుడ్ వైపు చూడట్లేదు. కొన్ని ఆఫర్స్ వచ్చినా.. నిర్దాక్షణ్యంగా నో చెప్పారు ఈ బ్యూటీ.