Anushka Shetty: అన్నయ్య కోసం రంగంలోకి అనుష్క శెట్టి.. ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్..

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినీరంగంలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ.. బాహుబలి సినిమా తర్వాత జోరు తగ్గించింది. ఎప్పుడో ఒక సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

Anushka Shetty: అన్నయ్య కోసం రంగంలోకి అనుష్క శెట్టి.. ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్..
Anushka
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Rajitha Chanti

Updated on: Dec 06, 2024 | 2:54 PM

లేడీ డాన్ అనుష్క శెట్టి ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంది. రోజిన్ థామస్ చిరకెక్కిస్తున్న KATHANAR సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా ఘాటి లో నటిస్తుంది. అయితే చాలా గ్యాప్ తర్వాత ఈ రెండు సినిమాలను స్వీటీ చేస్తుంది. ఇప్పటికే ఘాటి సినిమాకు సంబంధించిన టీజర్ ను కొద్దిరోజుల క్రితమే విడుదల చేశారు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు అనుష్క పెట్టింది పేరు. అలాంటి లేడీ సూపర్ స్టార్ మరో ఎక్స్పరిమెంటల్ లేడీ ఓరియంటెడ్ సినిమాలో కనిపించడంతో ఫాన్స్ తెగ కుషి అయ్యారు.

ఇక చాలాకాలం తర్వాత అనుష్క ఈ రెండు సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం బెంగళూరులోనే తన కుటుంబ సభ్యులతో అనుష్క ఉంటున్నట్లు సమాచారం. అయితే తన సోదరుడు గుణరంజన్ శెట్టి కోసం అనుష్క ప్రమోషన్లు చేస్తుంది. అనుష్క సోదరుడు కర్ణాటక రెజిలింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు.. బెల్లిపాడి గుణరంజన్ శెట్టి రెండు రోజులపాటు కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నాడు. కర్ణాటక రెజ్లింగ్ అసోసియేషన్ తరపున ఈ పోటీలు జరగనున్నాయి. ఈరోజు నుండి రెండు రోజులపాటు కోరమంగళ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జరగనున్నాయి.

ఈ పోటీలో పాల్గొనాలనుకునేవారు ఉచితంగా ఇందులో పార్టిసిపేట్ చేయవచ్చు. తన సోదరుడు నిర్వహిస్తున్న ఈ భారీ ఈవెంట్ కు అనుష్క తనదైన రీతిలో సపోర్ట్ చేస్తుంది. ఇన్‏స్టాగ్రామ్ వేదికగా తన సోదరుడు గుణరంజన్ కు మద్దతు ప్రకటిస్తూ కుస్తీ పోటీలో పాల్గొనేందుకు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. తాను కన్న కలలను నెరవేర్చుకున్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని సోదరుడిని ఉద్దేశించి అనుష్క పోస్ట్ పెట్టారు. ఎన్నో సవాళ్లను ఎదిరించి విజయం సాధించినపప్పుడు కలిగే సంతోషం మాటల్లో చెప్పలేనిదని అనుష్క శెట్టి ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.

Anushka Shetty

Anushka Shetty

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..
చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..
సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఎంతంటే?
సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఎంతంటే?
స్టార్ హీరోలతో చేసింది.. ఇప్పుడు ఆఫర్స్ రాక ఇలా..
స్టార్ హీరోలతో చేసింది.. ఇప్పుడు ఆఫర్స్ రాక ఇలా..
నిండు చూలాలి కడుపుపై కూర్చుని.. కాళ్లతో తొక్కి.. ఓ భర్త కిరాతకం
నిండు చూలాలి కడుపుపై కూర్చుని.. కాళ్లతో తొక్కి.. ఓ భర్త కిరాతకం
ప్రేమలు 2 పై క్రేజీ అప్డేట్..
ప్రేమలు 2 పై క్రేజీ అప్డేట్..
పిచ్చుకల కోసం తన ఇంటినే.. ఈ కరీంనగర్ యువకుడిని అభినందించాల్సిందే
పిచ్చుకల కోసం తన ఇంటినే.. ఈ కరీంనగర్ యువకుడిని అభినందించాల్సిందే
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్న మహిళ.. ఆ తర్వాత సీన్ ఇది
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్న మహిళ.. ఆ తర్వాత సీన్ ఇది
'జూనియర్‌ లైన్‌మెన్‌ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయండి'
'జూనియర్‌ లైన్‌మెన్‌ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయండి'
ఆదివారం మాంసం తింటున్నారా..? ఈ విషయం తెలిస్తే
ఆదివారం మాంసం తింటున్నారా..? ఈ విషయం తెలిస్తే
HYDలో సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్.. డిస్కౌంట్ లో టికెట్స్
HYDలో సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్.. డిస్కౌంట్ లో టికెట్స్