ANR: ఇండస్ట్రీలో అరుదైన సంఘటన.. 40 ఏళ్ల క్రితం షూటింగ్ కంప్లీట్.. ఇప్పుడు విడుదలకు సిద్ధం..

అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు రావాల్సిన మూవీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇక ఇప్పుడు సుమారు 40 సంవత్సరాల అనంతరం థియేటర్లలో సందడి చేయనుంది.

ANR: ఇండస్ట్రీలో అరుదైన సంఘటన.. 40 ఏళ్ల క్రితం షూటింగ్ కంప్లీట్.. ఇప్పుడు విడుదలకు సిద్ధం..
Prathibimbalu
Follow us

|

Updated on: Aug 17, 2022 | 10:55 AM

సినీ పరిశ్రమలో షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత సినిమాలు వాయిదా పడడం సర్వసాధారణం. పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ పనులు పూర్తిచేసుకుని సినిమా రిలీజ్ కావడమంటే చాలా కష్టమే. ఇప్పటికే కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని విడుదల కానివి ఉన్నాయి. అయితే తాజాగా తెలుగు చిత్రపరిశ్రమలో అరుదైన సంఘటన చోటు చేసుకోబోతుంది. దాదాపు నలభై ఏళ్ల క్రితం షూటింగ్ జరుపుకున్న సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు రావాల్సిన మూవీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇక ఇప్పుడు సుమారు 40 సంవత్సరాల అనంతరం థియేటర్లలో సందడి చేయనుంది. ఇంతకీ ఏ సినిమా ? ఎందుకు వాయిదా పడిందో తెలుసుకుందామా.

తెలుగు చిత్రపరిశ్రమలో అలనాటి అగ్రకథానాయకులలో అక్కినేని నాగేశ్వర్ రావు ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తన కెరీర్‏లో భారీ స్థాయి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. అయితే ఏఎన్నార్ నటించిన ఓ చిత్రం దాదాపు 40 ఏళ్ల తర్వాత విడుదలకు సిద్ధమైంది. ఏఎన్నార్, జయసుధ ప్రధాన పాత్రలలో 1982లో ప్రతిబింబాలు అనే సినిమా తెరకెక్కింది. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, కెఎస్ ప్రకాష్ రావులు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే అప్పట్లోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది కానీ అనివార్య కారణాలతో విడుదల కాలేదు. దీంతో మళ్లీ ఇన్నాళ్లకు ఈ సంవత్సరం సెప్టెంబర్ 20న ఏఎన్నార్ జయంతి సందర్భంగా థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇటీవల ఈ చిత్రా నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ మాట్లాడుతూ.. కొన్ని అనివార్య కారణాలతో ప్రతిబింబాలు సినిమా విడుదల చేయలేదు. ప్రస్తుతం సాంకేతికతను మిళితం చేసి, సరికొత్త హంగులతో సెప్టెంబర్ 20న ఏఎన్నార్ జయంతిని పురస్కరించుకుని విడుదల చేయాలనుకుంటున్నాం . తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?