ప్రస్తుతం ఎక్కడ చూసినా అతని పేరే వినిపిస్తుంది. తమిళ్ తెలుగు సినిమాలకు అతనే మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. సినిమా కథ ఎలా ఉన్నా.. తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నాడు. అతనే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. అనిరుధ్ పేరు వినని సినీ , సినీ సంగీత ప్రియులు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారిన ‘వై దిస్ కొలవెరి ‘ పాట కంపోజ్ చేసినప్పుడు అనిరుధ్ రవిచందర్ వయసు కేవలం 22 ఏళ్లు. చాలా చిన్న వయసులోనే సంగీత దర్శకత్వం ప్రారంభించిన అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న సంగీత దర్శకుల్లో ఒకరు. అనిరుధ్ కెరీర్ పీక్ లో ఉండగానే తన పంథా మార్చుకున్నాడు.
అనిరుధ్ రవిచందర్ సినిమా పాటలు ఒకదాని తర్వాత ఒకటి వైరల్ అవుతున్నాయి. తమిళం, తెలుగు చిత్రాలకు సంగీతం అందించిన అనిరుధ్ షారుక్ ఖాన్ ‘జవాన్’ ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ దశలో తనకు రోజుకో సినిమా ఆఫర్లు వస్తున్నాయని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు.అంతే కాదు ఆయన లైవ్ షోల టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. ఇదిలా ఉంటే అనిరుధ్ రవిచందర్ తాజాగా కొత్త నిర్ణయం తీసుకున్నాడు.
అనిరుధ్ రవిచందర్ ‘హుకుమ్’ పేరుతో ప్రపంచ సంగీత యాత్రలో బిజీగా ఉన్నారు. అనిరుధ్ విదేశాల్లో భారీ లైవ్ షోలు చేస్తున్నాడు.ఇదిలా ఉంటే ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నానని తెలిపాడు. విశేషమేమిటంటే మలయాళంలో ఆ సినిమాను అనిరుధ్ రవిచందర్ డైరెక్ట్ చేయబోతున్నాడు. కథకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని అనిరుధ్ తెలిపారు.
అలాగే, తన అభిమాన నటుడితో పాన్ ఇండియా సినిమా కోసం పనిచేస్తున్నట్లు కూడా పేర్కొన్నాడు. ఆ సినిమా నటుడే కాదు దర్శకుడు కూడా అనిరుధ్‌కి చాలా ఇష్టం. ఈ సినిమా ప్రమోషన్‌కు సంబంధించి ప్రొడక్షన్ హౌస్‌లో కొన్ని ప్లాన్స్ ఉన్నందున ప్రస్తుతం సినిమా గురించి పెద్దగా చెప్పలేనని అనిరుద్ అన్నారు. అనిరుధ్ ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా మూవీ ‘దేవర’తోపాటు కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్ 2’, ‘విడ మూర్చి’, రజనీకాంత్ ‘వెట్టయన్’, రజనీకాంత్ 171, విఘ్నేష్ శివన్ ‘ఎల్‌ఐసి’ చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.