బాల‌య్య‌, చిరుల‌తో సినిమాలు ఫైన‌ల్ చేసిన అనిల్ రావిపూడి

బాల‌య్య‌, చిరుల‌తో సినిమాలు ఫైన‌ల్ చేసిన అనిల్ రావిపూడి

టాలీవుడ్ లో ప్లాప్ అంటూ ఎరుగ‌ని దర్శ‌కుల లిస్ట్ లో జ‌క్క‌న్న‌ రాజమౌళి, కొరటాల శివ తర్వాత అనిల్ రావిపూడి కూడా ఉన్నాయి. అయితే ‘ఎఫ్2’ ముందు వరకూ అనిల్ రావిపూడి కేవ‌లం మీడియం రేంజ్ ఉన్న హీరోలతో మాత్రమే ప‌నిచేశాడు. స్టార్ ఇమేజ్ హీరోలను మ్యానేజ్ చెయ్యగలడా అనే డౌట్ అందరికీ వచ్చిన క్రమంలో మహేష్ బాబు తో ‘సరిలేరు నీకెవ్వరు’ తీసి ఇండ‌స్ట్రీ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ లో ‘ఎఫ్3’ స్క్రిప్ట్ […]

Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

May 02, 2020 | 3:37 PM

టాలీవుడ్ లో ప్లాప్ అంటూ ఎరుగ‌ని దర్శ‌కుల లిస్ట్ లో జ‌క్క‌న్న‌ రాజమౌళి, కొరటాల శివ తర్వాత అనిల్ రావిపూడి కూడా ఉన్నాయి. అయితే ‘ఎఫ్2’ ముందు వరకూ అనిల్ రావిపూడి కేవ‌లం మీడియం రేంజ్ ఉన్న హీరోలతో మాత్రమే ప‌నిచేశాడు. స్టార్ ఇమేజ్ హీరోలను మ్యానేజ్ చెయ్యగలడా అనే డౌట్ అందరికీ వచ్చిన క్రమంలో మహేష్ బాబు తో ‘సరిలేరు నీకెవ్వరు’ తీసి ఇండ‌స్ట్రీ హిట్ అందుకున్నాడు.

ప్రస్తుతం లాక్ డౌన్ లో ‘ఎఫ్3’ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు అనిల్… అది పూర్తయిన వెంటనే న‌ట‌సింహా బాలయ్య తో మూవీ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. నిజానికి చాలా రోజుల క్రిత‌మే బాలయ్య‌-అనిల్ రావిపూడి కాంబోలో ఎప్పుడో మూవీ ఫైన‌ల‌య్యింది. కానీ ఇద్ద‌రికీ డేట్స్ అడ్జ‌స్ట్ అవ్వ‌డం లేదు. దీనికి త్వ‌ర‌లోనే ముహుర్తం కుద‌ర‌బోతుంద‌ని అనిల్ ధీమాగా చెప్తున్నాడు. ఇక మ‌రోవైపు టాలీవుడ్ పెద్ద‌న్న చిరంజీవి కూడా త‌న డైర‌క్ష‌న్ లో మూవీ చెయ్య‌డానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న‌ట్టు అనిల్ స్వ‌యంగా ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. ఏది ఏమైనా టాలీవుడ్ టాప్ హీరోల ఫ్యాన్స్ కి మంచి బోనంజా ఇచ్చేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు ఈ యువ ద‌ర్శ‌కుడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu