AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Udaya Bhanu: ప్రెగ్నెన్సీలో ఆ హారర్ సినిమా చూసి భయపడిపోయా.. ఆస్పత్రికి వెళ్లిన కాసేపటికే.. ఉదయభాను ఎమోషనల్

మళ్లీ యాంకర్ గా బిజీ అవుతోన్న ఉదయ భాను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.ఇదే క్రమంలో ఓ హారర్ సినిమాలోని సీన్ చూసి తెగ భయపడిపోయానని, అబార్షన్ అయ్యిందని ఎమోషనల్ అయ్యింది.

Udaya Bhanu: ప్రెగ్నెన్సీలో ఆ హారర్ సినిమా చూసి భయపడిపోయా.. ఆస్పత్రికి వెళ్లిన కాసేపటికే.. ఉదయభాను ఎమోషనల్
Anchor Udaya Bhanu
Basha Shek
|

Updated on: May 24, 2026 | 4:27 PM

Share

ఒకప్పుడు యాంకర్ గా తెలుగు బుల్లితెరను ఏలింది ఉదయ భాను. తనదైన అందం, ఎనర్జీ, మాట తీరుతో ఎన్నో టీవీ షోలను రక్తి కట్టించింది. వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింభకా, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, రేలారే రేలారే, ఢీ, జాణవులే నెరజాణవులే, పిల్లలు, పిడుగులు.. ఇలా ఎన్నో సూపర్ హిట్ టీవీషోలకు యాంకర్ గా చేసింది ఉదయ భాను. అదే సమయంలో కొన్ని సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. అయితే పిల్లలు పుట్టిన తర్వాత చాలా ఏళ్ల పాటు బుల్లితెరకు, వెండితెరకు దూరమైందీ అందాల యాంకరమ్మ. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడే కెమెరా ముందుకు వస్తోంది. బుల్లితెరపై కొన్ని టీవీ షోల్లో సందడి చేస్తూనే కొన్ని ఈవెంట్స్‌కి హోస్ట్‌గాను వ్యవహరిస్తోంది. అలాగే అప్పుడప్పుడు బార్బరీకుడు వంటి సినిమాల్లోనూ కనిపిస్తోంది. తాజాగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరైంది ఉదయ భాను. అక్కడ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అదే సమయంలో ప్రెగెన్సీలో తను పడిన బాధల గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యింది.

‘పెళ్లి తర్వాత ఓ ఈవెంట్‌ కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ఎందుకైనా మంచిదని వెళ్లే ముందు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే గర్భం దాల్చిన విషయం తెలిసింది. వెంటనే డాక్టర్లను కలిశాను. ఫ్లైట్‌ జర్నీ చేయచ్చా? లేదా? అని అడిగా. వెళ్లచ్చు ఏం కాదని డాక్టర్లు చెప్పారు. అమెరికాకు వెళ్లిన తర్వాత వరుసగా ఈవెంట్స్ చేశాను. బాగా అలసిపోయా. మరుసటి రోజు ఆస్పత్రికి వెళ్లి చెక్‌ చేయించుకున్నా. బేబీ ఆరోగ్యం చాలా బాగుందని డాక్టర్లు చెప్పారు. నాకు చిన్నప్పటి నుంచి హారర్, క్రైమ్ సినిమాలంటే చాలా భయం. ఏ మూవీలోనైనా భయపడే సీన్స్ వస్తే కళ్లు, చెవులు మొత్తం మూసుకుంటా’

ఇవి కూడా చదవండి

కవల పిల్లలతో యాంకర్ ఉదయభాను..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Udaya Bhanu (@iamudayabhanu) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

‘ఒక రోజు అమెరికాలోనే కజిన్స్‌, ఫ్రెండ్స్‌ హారర్‌ సినిమా చూస్తున్నారు. అప్పుడు నేనూ ఇంట్లోనే ఉన్నా. అనుకోకుండా ఆ సినిమాలో ఓ సీన్ చూసి బాగా భయపడిపోయాను. అప్పుడే అనిపించింది నా బాడీలో ఏదో తేడా వచ్చిందని. వెంటనే ఆస్పత్రికి వెళ్లాను. డాక్టర్లు టెస్టుల మీద టెస్టులు చేస్తున్నారు. కానీ ఏ విషయమన్నది క్లారిటీగా చెప్పడం లేదు. మరోవైపు నాకు పెద్ద ఎత్తున బ్లీడింగ్ అవుతోంది. ఫ్లోర్ మొత్తం రక్తం నిండిపోయింది. కాసేపటి తర్వాత అబార్షన్‌ అయిందని డాక్టర్లు చెప్పారు. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. అనుకోకుండా అబార్షన్ అవ్వడంతో చాలా బాధపడ్డా. ఏడాది పాటు డిప్రెషన్‌లోకి వెళ్లా. కానీ ఆ భగవంతుడు నాకు మళ్లీ మంచి అవకాశం ఇచ్చాడు. ఏడాది తర్వాత మళ్లీ గర్భవతిని అయ్యాను. టెస్ట్‌ చేస్తే కలవలు అని తెలిసింది. పిల్లలు పుట్టాక నా జీవితమే మారిపోయింది. ఇప్పుడు వాళ్లే నా ప్రపంచం’ అని ఎమోషనల్ అయ్యింది ఉదయ భాను.

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Udaya Bhanu (@iamudayabhanu) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us