బన్నీని వెంటాడుతున్నది ఎవరు?

హీరో అల్లు అర్జున్‌పై ఈమధ్య సోషల్ మీడియాలో బాగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా బన్నీని టార్గెట్ చేస్తూ ఇలాంటివి హల్‌చల్ చేస్తున్నాయి. నెల గ్యాప్‌లోనే ఇంత నెగటివ్ ప్రచారం ఎందుకు జరుగుతోంది? బన్నీ విషయంలో ఏం జరుగుతోంది అన్నది సందేహాన్ని కలిగిస్తుంది. తన గురించి ఇంత నెగిటివ్ ప్రచారం జరగుతుండటంతో బన్నీ ఉలిక్కిపడ్డాడు. మొదట లైట్ తీసుకున్నా.. ఇప్పడు మాత్రం సమ్‌థింగ్ ఏదో ఉంది అనే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఒకటొకటిగా వచ్చి పడుతున్న రూమర్స్‌తో […]

బన్నీని వెంటాడుతున్నది ఎవరు?
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 28, 2019 | 8:02 PM

హీరో అల్లు అర్జున్‌పై ఈమధ్య సోషల్ మీడియాలో బాగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా బన్నీని టార్గెట్ చేస్తూ ఇలాంటివి హల్‌చల్ చేస్తున్నాయి. నెల గ్యాప్‌లోనే ఇంత నెగటివ్ ప్రచారం ఎందుకు జరుగుతోంది? బన్నీ విషయంలో ఏం జరుగుతోంది అన్నది సందేహాన్ని కలిగిస్తుంది. తన గురించి ఇంత నెగిటివ్ ప్రచారం జరగుతుండటంతో బన్నీ ఉలిక్కిపడ్డాడు. మొదట లైట్ తీసుకున్నా.. ఇప్పడు మాత్రం సమ్‌థింగ్ ఏదో ఉంది అనే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఒకటొకటిగా వచ్చి పడుతున్న రూమర్స్‌తో బన్నీ ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. దీని వెనుక ఎవరో ఉన్నరనే డౌట్స్ వస్తున్న నేపథ్యంలో బన్నీ కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకీ బన్నీని టార్గెట్ చేసింది ఎవరు? అల్లు అర్జున్‌ని ఎవరైనా పెద్ద హీరో టార్గెట్ చేశాడా? ఈ విషయంలో బన్నీకి కూడా కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి.

అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ఏప్రిల్‌లో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుుతానికి 30 శాతం షూటింగ్ పూర్తయింది. సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. ఇటీవల టబూ కూడా షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. అల్లు అర్జున్ ఇంతకుముందు నటించిన మూవీ నాపేరు సూర్య నాయిల్లు ఇండియా సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. అప్పటినుంచి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలని భావిస్తూ.. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో కలిసి ఈ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్‌తో మరో సినిమా కూడా చేయబోతున్నాడు. ఇలాంటి సమయంలో బన్నీని ఇంతగా టార్గెట్ చేయడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

అయితే అల్లుపై వస్తున్న రూమర్స్‌పై మెగా టీమ్ కూడా స్పందించింది. తన సొంత కష్టంతో ఎదిగిన తమ హీరో ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్న వారిని సున్నితంగా హెచ్చరిస్తూ ఓ ట్వీట్ కూడా చేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu