Pushpa 2: అవతార్2 థియేటర్స్‌లో పుష్పరాజ్ సందడి.. సుకుమార్ మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2009లో విడుదలైన 'అవతార్' మొదటి పార్ట్ ప్రేక్షకులకు సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లింది.

Pushpa 2: అవతార్2 థియేటర్స్‌లో పుష్పరాజ్ సందడి.. సుకుమార్ మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..
Pushpa 2, Avatar2
Follow us

|

Updated on: Nov 14, 2022 | 9:57 AM

లెజెండ్రీ డైరెక్టర్ జేమ్స్ కామోరూన్ అద్భుత సృష్టి అవతార్ సినిమాకు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. అవతార్ కు మించి అవతార్ 2 ను తెరకెక్కించారు జేమ్స్ కామోరూన్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2009లో విడుదలైన ‘అవతార్’ మొదటి పార్ట్ ప్రేక్షకులకు సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంది. అవతార్ సినిమా తర్వాత అలాంటి సోషియో ఫాంటసీ సినిమాలకు క్రేజ్ మరింత పెరిగింది. మనుషులకు గ్రహాంతర వాసులకు మధ్య జరిగే యుద్ధంన్ని అద్భుతంగా చూపించారు దర్శకుడు జేమ్స్. 234 మిలియన్ డాలర్ల బడెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.924 బిలియన్ డాలర్లను వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ రానుంది. ఈ సినిమా కు సంబంధించిన గ్లిమ్స్ ను , పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా నుంచి  ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ తో మూవీ పై అంచనాలను ఆకాశానికి చేర్చారు దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌ .

‘అవతార్-2’ ది వే ఆఫ్ వాటర్ డిసెంబర్ 16న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే సమయంలో పుష్ప 2 టీజర్ కూడా రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు సుకుమార్ అండ్ టీమ్. టీజర్ కాకపోయినా పుష్ప 2 గ్లిమ్ప్స్ ను ఆ టైం కి రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.

అవతార్ 2 సినిమా ప్రదర్శనలో పుష్ప 2 టీజర్ ను ప్లే చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో టీజర్ కు సంబంధించిన విజువల్స్ ను చకచకా షూట్ చేస్తున్నారట. అవతార్ సినిమాతో పాటు తీ టీజర్ ను కూడా థియేటర్స్ లో ప్లే చేయనున్నారని తెలుస్తోంది. ఇదే వేదికగా సినిమా రిలీజ్ తేదిని కూడా అధికారికంగా ప్రకటించాలని సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఇవి కూడా చదవండి