Pushpa Movie: పుష్ప సినిమా షూటింగ్ ఆలస్యం.. నిరాశలో అభిమానులు.. కారణం అతడేనా..

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో

Pushpa Movie: పుష్ప సినిమా షూటింగ్ ఆలస్యం.. నిరాశలో అభిమానులు.. కారణం అతడేనా..
Allu Arjuna Pushpa Raj
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: May 01, 2021 | 8:30 AM

Pushpa Movie:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత యూర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్ సినిమా పై అంచనాలని తారాస్థాయికి చేర్చాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించి చాలా వరకూ షూటింగు కానిచ్చారు. అయితే ఈ సినిమా షూటింగ్ అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.

ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న సునీల్ – అనసూయ కాంబినేషన్ లో కొన్ని సీన్స్.. ఫహద్ ఫాజిల్ పాల్గొనే సన్నివేశాలని ఇప్పటికే తెరకెక్కించారు. తర్వాత డేట్స్ సమస్య వస్తుందేమో అని భావించి రిస్క్ అయినా కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే షూటింగ్ కొనసాగించారు. అదే సమయంలో బన్నీ కరోనా బారిన పడటంతో, ఆయనకి బ్రేక్ ఇచ్చారు. ఆ తరువాత ఫహాద్ కి సంబంధించిన సీన్స్ ను చిత్రీకరించాలని సుకుమార్ అనుకున్నాడట. కానీ పరిస్థితులు బాగోలేని కారణంగా, తాను చేయలేనని ఫహాద్ చెప్పినట్టుగా తెలుస్తోంది. రోజురోజుకు కరోనా ఉదృతి ఎక్కువ అవుతుండటంతో ఫహాద్ హోమ్ టౌన్ కి వెళ్లిపోయారట. దాంతో పుష్ప షూటింగ్ కు ప్యాకప్ చెప్పేశాడట సుక్కు.

మరిన్ని ఇక్కడ చదవండి :

వెరైటీ పెళ్లి పత్రిక.. కరోనా టైంలో లగ్గం.. కానుకల కోసం క్యూఆర్ కోడ్.. నెట్టింట వైరల్.!

Samantha: `ఈ క‌ష్ట స‌మ‌యంలో మ‌నంద‌రం క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఉంది`.. మ‌రో మంచి కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన సామ్‌..

Pooja Hegde: క‌రోనా వేళ అవ‌స‌ర‌మైన టిప్స్ చెబుతోన్న బుట్ట‌బొమ్మ‌.. ఈ ప‌రిస్థితుల్లో ఇది ఎంతో మేలు చేస్తుందంటా..