Pushpa 2: పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.. బుక్ మై షోతో పాటు ఈ యాప్‌లోనూ టికెట్లు పొందవచ్చు

అల్లు అర్జున్ అభిమానుల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న 'పుష్ప 2.. ది రూల్' చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారు 13 వేలకు పైగా స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శితం కానుందని తెలుస్తోంది.

Pushpa 2: పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.. బుక్ మై షోతో పాటు ఈ యాప్‌లోనూ టికెట్లు పొందవచ్చు
పుష్ప ది రూల్‌ గురించి ప్రొడ్యూసర్‌ చెప్పిన మాటలు ఇవి.. మరి సెన్సార్‌ కోసం స్క్రీన్‌ మీద చూసిన వారు కూడా ఇలాగే ఫీలయ్యారా.?
Follow us
Basha Shek

|

Updated on: Dec 01, 2024 | 11:21 AM

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి CBFC నుండి U/A సర్టిఫికేట్ వచ్చింది. సినిమా విడుదలయ్యే థియేటర్ల జాబితా కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక శనివారం (నవంబర్ 30) తెలంగాణ ప్రభుత్వం ‘పుష్ప 2’ సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా సినిమాకు సంబంధించిన అదనపు షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. అయితే కొన్ని షరతులు కూడా విధించారు. ఇక తాజాగా పుష్ప సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. శనివారం సాయంత్రం 04:56 గంటలకి తెలంగాణలో పుష్ప 2: ది రూల్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా రికార్డు స్థాయిలో టికెట్స్ సేల్ అవుతున్నాయి. ఈ టికెట్లు బుక్ మై షో యాప్‌తో పాటు జొమాటో ప్రారంభించిన డిస్ట్రిక్ట్ యాప్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. కాగా ఇప్పటికే హిందీలో టికెట్ బుకింగ్స్ రిలీజ్ కాగా దాదాపుగా 20వేలకి పైగా టికెట్లు అమ్ముడయ్యాయని సమాచారం

పుష్ప సినిమాని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నారు. కాగా డిసెంబర్ 04 రాత్రి 9:30 గంటలకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బెనిఫిట్ షోలను ప్రదర్శించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇక సినిమా విడుదల రోజు అంటే డిసెంబర్ 05న తెలంగాణలోని అన్ని థియేటర్లలో రెండు అదనపు షోలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. అయితే ఏపీలో ఇంకా టికెట్ల ధరల విషయం కొలిక్కిరాకపోవడంతో పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాలేదు. దీనిపై ఈరోజు లేదా రేపు ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక ఆదివారం (డిసెంబర్ 01) హైదరాబాద్ లో జరగాల్సిన పుష్ప 2 ఈవెంట్ సోమవారం (డిసెంబర్ 02) కు వాయిదా పడింది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో పుష్ప 2 ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.