Pushpa 2 : హైదరాబాద్‌‍లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. వేదిక ఎక్కడంటే.. కానీ

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ మూవీ ఈవెంట్స్ నిర్వహిస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నాడు. ఈరోజు ముంబైలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

Pushpa 2 : హైదరాబాద్‌‍లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. వేదిక ఎక్కడంటే.. కానీ
Pushpa 2 The Rule
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 29, 2024 | 9:49 PM

డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన పుష్ప 2 పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకులలో మరింత ఆసక్తిని కలిగించేందుకు చిత్రయూనిట్ విభిన్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. డిసెంబర్ 5న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పాట్నాలో ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం. మరోవైపు చెన్నై, కొచ్చి, ముంబయి ఈ మూవీ ఈవెంట్స్ నిర్వహించారు. అల్లు అర్జున్, రష్మిక మందన్నా తమ సినిమా ప్రమోషన్స్ కోసం తెగ కష్టపడుతున్నారు. అయితే సౌత్ టూ నార్త్ పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ఈవెంట్ నిర్వహిస్తారు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా వీటిపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోనే ఈ మూవీ వేడుక నిర్వహించనుండగా.. మేకర్స్ ప్లాన్ లో చిన్న మార్పు జరిగినట్లు తెలుస్తోంది.

పుష్ప 2 మూవీ ఈవెంట్ కోసం ఎన్ని లక్షల మంది వస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. గత కొన్ని రోజులుగా యూసుఫ్ గూడ పోలీస్ లైన్స్ లో భారీ ఓపెన్ ప్లేస్ లో ఈ మూవీ ఈవెంట్ జరగనుందనే టాక్ నడిచింది. అంతకు ముందు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ వద్ద ఈ ఈవెంట్ జరగనుందని టాక్ నడిచింది. ఇక ఇప్పుడు మరో న్యూస్ తెరపైకి వచ్చింది. నెట్టింట వినిపిస్తున్న టాక్ ప్రకారం పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించనున్నారని తెలుస్తోంది. అయితే పోలీసుల అనుమతి, ఇతర విషయాలపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

డిసెంబర్ 1న మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక, జగపతి బాబు, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలో నటిస్తుండగా.. శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తుంది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.