Allu Arjun: ఇదెక్కడి సిత్రం మావా.. పుష్ప 2 సినిమా అప్ డేట్స్ ఇవ్వాలంటూ రోడ్డు మీదకే వచ్చేశారుగా..

కొద్ది రోజులుగా పుష్ప 2 అప్డేట్ రాబోతుందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికీ ఈ సినిమా పై ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో పుష్ప2 అప్డేట్ ఇవ్వాలంటూ రోడ్డెక్కారు బన్నీ ఫ్యాన్స్. చేతిలో బ్యానర్లు.. పోస్టర్లు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

Allu Arjun: ఇదెక్కడి సిత్రం మావా.. పుష్ప 2 సినిమా అప్ డేట్స్ ఇవ్వాలంటూ రోడ్డు మీదకే వచ్చేశారుగా..
Pushpa 2
Follow us

|

Updated on: Nov 18, 2022 | 10:03 AM

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో అల్లు అర్జున్.. రష్మిక మందన్న జంటగా నటించారు. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా నార్త్‏లో పుష్ప సినిమాకు ఊహించని స్థాయిలో రెప్సాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం పుష్ప సిక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు మేకర్స్. ఇటీవల ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. పుష్ప విజయం తర్వాత పుష్ప 2 పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ అప్డేట్స్ ఇవ్వాలంటూ నెట్టింట గగ్గోలు పెడుతున్నారు సినీ ప్రియులు. ఇటీవల ఓ షోలో పాల్గొన్న బన్నీ.. పుష్ప 2 అప్డేట్ అంటూ అస్సలు తగ్గేదే లే అని చెప్పడంతో ఈ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా పుష్ప 2 అప్డేట్ రాబోతుందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికీ ఈ సినిమా పై ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో పుష్ప2 అప్డేట్ ఇవ్వాలంటూ రోడ్డెక్కారు బన్నీ ఫ్యాన్స్. చేతిలో బ్యానర్లు.. పోస్టర్లు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇవి కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, యుఎఇకి చెందిన అభిమానుల చిత్రాలు అని తెలుస్తోంది. తమ చేతుల్లో బ్యానర్లు పట్టుకుని వీధుల్లో నిలబడి పుష్ప సీక్వెల్ గురించి అప్‌డేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ‘పుష్ప విజయం తర్వాత, అల్లు అర్జున్ అభిమానులు ఇప్పుడు సీక్వెల్ అప్డేట్స్ కోసం వీధుల్లో కి వచ్చేశారు. అభిమానుల్లో క్యూరియాసిటీ విపరీతంగా ఉంది. ఇలాంటివి గతంలో ఎన్నడూ చూడలేదు. అతని గొంతులో ఉత్సుకత స్పష్టంగా ఉంది’ అని ఈ ట్వీట్‌లో రాశారు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ సినిమాలో బన్నీతోపాటు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో నటిస్తుండగా.. సునీల్, అనసూయ కనిపించనున్నారు. గత వారం ఈ సినిమాలో నటీనటుల లుక్ టెస్ట్ జరిగింది. సినిమాటోగ్రాఫర్ మిరాస్లో కుబా బ్రోజెక్ అల్లు అర్జున్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్