నాగబాబు వెంటే మేమంటూ..

జబర్దస్త్ కామెడీ షో నుంచి ఇప్పటికే నాగబాబు సహా చాలామంది కమెడియన్లు వలస వెళ్లారనే వార్త తెలిసిన సంగతే. నాగబాబు స్థానంలో జడ్జ్ గా హాస్యనటుడు అలీ ,కొత్త పగ్గాలు చేపట్టబోతున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. ఎలక్షన్ల సమయంలో నాగబాబు ప్రచారం పనుల్లో బిజీగా ఉండగా గెస్ట్ జడ్జ్ గా అలీ ఆ సీటుపై దర్శనమిచ్చాడు.. ఇక ఇప్పుడు నాగబాబు నిష్క్రమణతో శాశ్వతంగా ఆ సీటు దక్కించుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అలీ […]

నాగబాబు వెంటే మేమంటూ..

జబర్దస్త్ కామెడీ షో నుంచి ఇప్పటికే నాగబాబు సహా చాలామంది కమెడియన్లు వలస వెళ్లారనే వార్త తెలిసిన సంగతే. నాగబాబు స్థానంలో జడ్జ్ గా హాస్యనటుడు అలీ ,కొత్త పగ్గాలు చేపట్టబోతున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. ఎలక్షన్ల సమయంలో నాగబాబు ప్రచారం పనుల్లో బిజీగా ఉండగా గెస్ట్ జడ్జ్ గా అలీ ఆ సీటుపై దర్శనమిచ్చాడు.. ఇక ఇప్పుడు నాగబాబు నిష్క్రమణతో శాశ్వతంగా ఆ సీటు దక్కించుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అలీ జడ్జ్ గా ఉన్న రెండు ఎపిసోడ్లు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది..

ఇదిలా ఉంటే ఇప్పటికే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి కంటెస్టంట్స్ జబర్దస్త్ ని వీడినట్టుగా కన్ఫాం చేసారు..తాజాగా మరొక కమెడియన్ చమ్మక్ చంద్ర కూడా తాను జబర్దస్త్ నుండి బయటకి వచ్చేసినట్టు ధృవీకరించాడు. వీరి బాటలోనే ఇంకా చాలా మంది జబర్దస్త్ ని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి ప్రోగ్రాం పై అఫిషియల్ గా ఏ స్టేట్మెంట్ బయటకి రానప్పటికీ, జీతెలుగులో త్వరలోనే వీరితో ఓ ప్రోగ్రాం మొదలవబోతుందనే వార్తలు వస్తున్నాయి.