Bangarraju Teaser: వాసివాడి తస్సాదియ్య.. అదరగొట్టిన బంగార్రాజులు.. ఆకట్టుకుంటున్న టీజర్..

అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

Bangarraju Teaser: వాసివాడి తస్సాదియ్య.. అదరగొట్టిన బంగార్రాజులు.. ఆకట్టుకుంటున్న టీజర్..
Nagarjuna
Follow us

|

Updated on: Jan 01, 2022 | 3:29 PM

Bangarraju Teaser: అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో హిట్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ సిద్ధం చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నూత‌న సంవ‌త్స‌రం రోజున ఉదయం ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు.

ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నూత‌న సంవ‌త్స‌రం రోజున బంగార్రాజు టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు.  నాగార్జున పంచెక‌ట్టులో నాగ‌చైత‌న్య స్టైలీష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా డిజన్ చేశారు. ఇక నాగచైతన్య కృతిశెట్టికి లైన్ వేయడం.. శివాలయంలో ఎదో తప్పుజరుగుతుందని చూపించారు. ఆ తప్పును నాగార్జున ఎలా అడ్డుకున్నాడన్నది చూపించనున్నారని టీజర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఇక  అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో వ‌చ్చిన పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ వాసివాడి తస్సాదియ్య అనే పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. నాగార్జున, నాగ చైతన్య కలిసి ఇందులు స్టెప్పులు వేయగా.. ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.

Also Read: Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‏తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..

Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

Telangana – Theater: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ ప్రకటన..

Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..