Ajith Kumar: ఓకే దర్శకుడితో వరుస సినిమాలు చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న స్టార్ హీరో..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మరో హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నారు. అజిత్ రిపీట్‌ చేస్తున్న ఈ హ్యాట్రిక్‌... సక్సెస్‌ విషయంలో కాదు.. కాంబినేషన్‌ విషయంలో.

Ajith Kumar: ఓకే దర్శకుడితో వరుస సినిమాలు చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న స్టార్ హీరో..
Ajith
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: May 01, 2021 | 8:48 AM

Ajith Kumar:

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మరో హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నారు. అజిత్ రిపీట్‌ చేస్తున్న ఈ హ్యాట్రిక్‌… సక్సెస్‌ విషయంలో కాదు.. కాంబినేషన్‌ విషయంలో. యస్‌… గతంలో శివ దర్శకత్వంలో మూడు సినిమాలు కంటిన్యూస్‌గా చేసిన అజిత్‌ ఇప్పుడు హెచ్‌ వినోద్‌తోనూ మూడో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. అంతేకాదు ఈ సారి నిర్మాతను కూడా రిపీట్ చేస్తుండటం మరో విశేషం.

మాస్ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు శివతో నాలుగు సినిమాలు చేసిన అజిత్… వేదాలం, వివేగం, విశ్వాసం సినిమాలు వెంట వెంటనే చేశారు అజిత్‌. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్‌. తరువాత హెచ్‌ వినోద్ కాంబోలో కూడా సేమ్‌ ఫార్ములా రిపీట్ చేస్తున్నారు తలా. పింక్‌ రీమేక్‌ నేర్కొండపార్వై కోసం తొలిసారిగా అజిత్‌, వినోద్ కాంబో సెట్‌ అయ్యింది.

ప్రజెంట్ అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వలిమై సినిమాకు కూడా హెచ్‌ వినోదే దర్శకుడు. ఈ రెండు సినిమాలను బాలీవుడ్ నిర్మాత బోనీకపూరే నిర్మించారు. తన నెక్ట్స్ సినిమాను కూడా వినోద్ డైరెక్షన్‌లోనే చేసేందుకు ఓకే చెప్పారు అజిత్. ఈ సినిమాను కూడా బోనీ కపూరే నిర్మించబోతున్నారట. ఓకే దర్శకుడితో వరుస సినిమాలు చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు అజిత్‌.

మరిన్ని ఇక్కడ చదవండి :

‘వకీల్ సాబ్’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో..! ఫ్యాన్స్‌కి పండగే.. వెంటనే చూసి ఆనందించండి..

Samantha: `ఈ క‌ష్ట స‌మ‌యంలో మ‌నంద‌రం క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఉంది`.. మ‌రో మంచి కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన సామ్‌..

????????? ???????????: డ్యాన్స్ తో అద‌ర‌గొట్టిన ‘జ‌య‌మ్మ‌’.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన వీడియో

RGV Tweet: “2022లో మ‌నుషులు ఉండ‌క‌పోవ‌చ్చు”.. త‌న‌దైన శైలిలో కామెంట్ చేసిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌..