టిక్​టాక్​ ఐశ్వర్యా రాయ్​కు హీరోయిన్​గా ఛాన్స్..

టాలెంట్ ఎవ‌డ‌బ్బ సొత్తు కాదు. రామ్ గోపాల్ వ‌ర్మ చెప్పిన మాట ఇది. ఆ మాట వాస్త‌వం కూడా. ఒక‌ప్పుడు అంటే సినిమా అవ‌కాశాల కోసం చెప్పులు అరిగిపోయాలా స్టూడియోల చుట్టూ..ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల చుట్టూ తిర‌గాల్సి వ‌చ్చేది. ఇప్పుడు సోష‌ల్ మీడియా పెరిగిపోయింది. ప్ర‌తిభ ఉంటే చాలు..దాన్ని బ‌హిర్గ‌తం చెయ్య‌డానికి చాలా సాధ‌నాలు ఉన్నాయి.

టిక్​టాక్​ ఐశ్వర్యా రాయ్​కు హీరోయిన్​గా ఛాన్స్..
Follow us

|

Updated on: Jun 13, 2020 | 5:38 PM

టాలెంట్ ఎవ‌డ‌బ్బ సొత్తు కాదు. రామ్ గోపాల్ వ‌ర్మ చెప్పిన మాట ఇది. ఆ మాట వాస్త‌వం కూడా. ఒక‌ప్పుడు అంటే సినిమా అవ‌కాశాల కోసం చెప్పులు అరిగిపోయాలా స్టూడియోల చుట్టూ..ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల చుట్టూ తిర‌గాల్సి వ‌చ్చేది. ఇప్పుడు సోష‌ల్ మీడియా పెరిగిపోయింది. ప్ర‌తిభ ఉంటే చాలు..దాన్ని బ‌హిర్గ‌తం చెయ్య‌డానికి చాలా సాధ‌నాలు ఉన్నాయి. అందులో ఒక‌టి టిక్​టాక్. యువ‌త ఈ సోష‌ల్ మీడియా యాప్ కి బాగా ఎట్రాక్ట్ అవుతోంది. దీనివల్ల చెడు ఉంది..మంచి ఉంది. అయితే ఈ యాప్ ఇప్పుడు టాలెంట్ హంట్ గా మారుతోంది. తాజాగా బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్​ పోలికలతో ఉన్న అమృతా సాజు టిక్​టాక్ వీడియోలు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. అమిత‌మైన ఫాలోయింగ్ తో ఆమె ఇప్పుడు స్టార్ గా మారిపోయింది. ఆమె వీడియోలను యాప్​లో అమృతను లక్షల మంది ఫాలో అవుతున్నారు. అచ్చుగుద్దిన‌ట్టు ఐశ్వర్యను పోలి ఉన్న ఈ అమ్మాయిది కేరళలోని తొడుప్పుజా. కొన్నియాడ్స్ లో కూడా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమృతను చూసి చాలా మంది నిజం హీరోయిన్​ అని భ్రమపడ్డారు కూడా. కాగా ల‌క్కు క‌లిసొచ్చి ఆమెకు ఇటీవలే హీరోయిన్​గా ఓ మలయాళ మూవీలో అవ‌కాశం​ లభించింది.

మలయాళ సినిమా ‘పికాసో’లో అమృత హీరోయిన్​గా నటిస్తోంది. ఈ సినిమాకు సునీల్​ కరియట్టుకర దర్శకత్వం వహిస్తుండగా.. షేక్​ అఫ్సాల్​ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్​ రిలీజ్ చెయ్య‌గా..అది ఇప్పుడు వైరల్​ అయ్యింది. మూవీస్ లో నటించాలనే త‌ప‌న‌తో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన అమృతకు మంచి పాత్రలు లభిస్తున్నాయి.

https://www.facebook.com/Picassomovie/videos/2497356567192908/