Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rai: ఆ వీడియోలను తొలగించండి.. కోర్టు మెట్లెక్కిన ఐశ్వర్య రాయ్ కూతురు

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకుల పుకార్ల తర్వాత ఇప్పుడు ఆరాధ్య గురించి తప్పుడు వార్తలు, కథనాలు వస్తున్నాయి. దీనిపై బచ్చన్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐశ్వర్య, అభిషేక్ లతో పాటు, ఆరాధ్య కూడా ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Aishwarya Rai: ఆ వీడియోలను తొలగించండి.. కోర్టు మెట్లెక్కిన ఐశ్వర్య రాయ్ కూతురు
Aishwarya Rai
Follow us
Basha Shek

|

Updated on: Feb 04, 2025 | 11:08 AM

బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్, నటుడు అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోనున్నరని మొన్నటి వరకు పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇప్పుడు ఈ రూమర్లు కాస్త తగ్గాయి. అయితే ఇప్పుడు ఐశ్వర్య ఫ్యామిలీకి సంబంధించి మరో కొత్త పుకారు వినిపిస్తోంది. అయితే అది ఐశ్వర్య రాయ్ లేదా అభిషేక్ గురించి కాదు. వారి గారాల పట్టి ఆరాధ్ బచ్చన్ గురించి. ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలోవస్తోన్న తప్పుడు వార్తలపై బచ్చన్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆరాధ్య ఆరోగ్యం గురించి కొన్ని వెబ్ సైట్స్, సోషల్ మీడియా అకౌంట్స్, యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు కథనాలు పబ్లిష్ చేసాయి. కొన్నైతే ఏకంగా ఆరాధ్య బచ్చన్ చనిపోయిందని ప్రచారం చేశాయి. ఈ ఫేన్ న్యూస్‌పై ఆగ్రహించిన బచ్చన్ కుటుంబం, అలాంటి వీడియోలను తొలగించాలని డిమాండ్ చేస్తూ 2023లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2023 లో ఆరాధ్య మైనర్ అని, ఇలాంటి కల్పిత వార్తలను వ్యాప్తి చేయడాన్ని ఆపాలని డిమాండ్ వచ్చింది. ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వీడియోలను యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ నుండి తొలగించాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఇప్పుడు మరోసారి ఇదే విషయానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో దరఖాస్తు దాఖలైంది.

2025లో ఆరాధ్య తల్లిదండ్రులుగా ఐశ్వర్య రాయ్, అభిషేక్ ఢిల్లీ హైకోర్టులో కొత్త దరఖాస్తును దాఖలు చేశారు. ఈ కొత్త అప్లికేషన్ ప్రకారం, ఢిల్లీ హైకోర్టు గూగుల్ సహా కొన్ని వెబ్‌సైట్‌లకు నోటీసులు పంపింది. అయితే కొంతమంది యూట్యూబర్లు ఇంకా హాజరు కాలేదని, ఇంకా ఆ న్యూస్ తీసేయకపోవడం, ఆ వార్తలు ఇంకా ఆన్లైన్ లో చక్కర్లు కొడుతుండటంతో మరోసారి ఆరాధ్య బచ్చన్ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు చెప్పినా ఇంకా అలాంటి వార్తలను తీసివేయలేదని, కఠిన చర్యలు తీసుకోవాలని తన పిటిషన్ లో పేర్కొంది ఆరాధ్య. దీంతో హైకోర్టు గూగుల్ కి నోటీసులు జారీ చేసింది. దీనిపై మార్చ్ 17న తదుపరి విచారణ జరగనుందని న్యాయ స్థానం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ఐశ్వర్య, అభిషేక్ 2007 లో వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత 2011 లో ఆరాధ్య జన్మించింది. కాగా ఈ మధ్యన ఆరాధ్య తరచుగా తన తల్లితోనే ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని నెలల క్రితం, ఆరాధ్య స్కూల్లో ఒక కార్యక్రమం జరిగింది, అందులో ఆరాధ్య కూడా ప్రదర్శన ఇచ్చింది. అభిషేక్-ఆరాధ్యతో పాటు అమితాబ్ బచ్చన్ కూడా తన మనవరాలి ప్రదర్శన చూడటానికి వచ్చారు. ఆరాధ్య ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతోంది.

పార్టీలో అభిషేక్, ఐశ్వర్య,..

View this post on Instagram

A post shared by Anu Ranjan (@anuranjan1010)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.