Tamannaah Bhatia: నీ ముఖానికి అంత సీన్ లేదు అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన తమన్నా

|

Jul 26, 2023 | 6:56 PM

శ్రీ సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టిన తమన్నా ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది.

Tamannaah Bhatia: నీ ముఖానికి అంత సీన్ లేదు అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన తమన్నా
Tamannaah
Follow us on

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా నటించిన వయ్యారి భామల్లో తమన్నా ఒకరు. మిల్కీ బ్యూటీ గా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. శ్రీ సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టిన తమన్నా ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించింది ఈ భామ. అలాగే హిందీలోనూ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం తమన్నా టాలీవుడ్ లో స్పీడ్ తగ్గించిందనే చెప్పాలి. యంగ్ హీరోల సరసన సినిమాలు చేసిన ఈ బ్యూటీ. ఇప్పుడు సీనియర్ హీరోలతో జోడీ కడుతుంది.

ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలో వెంకటేష్ సరసన నటించిన మిల్కీ బ్యూటీ.. ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తోంది. భోళాశంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది తమన్నా.. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

కేరీర్ బిగినింగ్ లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది మిల్కీ బ్యూటీ. సినిమాల్లోకి వెళ్తాను అని అంటే ఆమెను హేళన చేశారట..నీ మొహానికి హీరోయిన్ అవుతావా అని అన్న వాళ్ళు కూడా ఉన్నారట. అలా అన్నది బయట వాళ్ళు కూడా కాదట.. తన సొంత వారే నీ ఫేస్ కు హీరోయిన్ అంత సీన్ లేదు అని అన్నారట.. అప్పుడు చాలా హర్ట్ అయ్యాను అని తెలిపింది తమన్నా.. కానీ పట్టుదలతో తనను తాను ప్రూవ్ చేసుకొని ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తున్నాను అని తెలిపింది ఈ చిన్నది.