Samyuktha Menon: ‘మా నాన్న ఇంటిపేరు నాకొద్దు.. ఇకపై నన్ను అలాగే పిలవండి’.. భీమ్లానాయక్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..

తన వ్యక్తిగత జీవితం గురించి.. తల్లిదండ్రుల గురించి అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై తనను సంయుక్త అని మాత్రమే పిలవాలని.. తన పేరు పక్కనే ఉన్న తన తండ్రి ఇంటి పేరును తొలగిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇందుకు గల కారణాలను కూడా బయటపెట్టింది.

Samyuktha Menon: 'మా నాన్న ఇంటిపేరు నాకొద్దు.. ఇకపై నన్ను అలాగే పిలవండి'.. భీమ్లానాయక్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..
Samyuktha Menon
Follow us

| Edited By: Basha Shek

Updated on: Feb 16, 2023 | 5:57 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన చిత్రం భీమ్లానాయక్. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నిత్యామీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించారు. అయితే ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త. ఈ చిత్రంలో రానా భార్యగా కనిపించి నటనపరంగా ప్రశంసలు అందుకున్నారు. దీంతో ఆమెకు అటు తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేరళ కుట్టి నటిస్తోన్న చిత్రం సార్. తమిళ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ మూలీ తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఏకకాలంలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే బుధవారం విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ఓ తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంయుక్త మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేసింది. తన వ్యక్తిగత జీవితం గురించి.. తల్లిదండ్రుల గురించి అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై తనను సంయుక్త అని మాత్రమే పిలవాలని.. తన పేరు పక్కనే ఉన్న తన తండ్రి ఇంటి పేరును తొలగిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇందుకు గల కారణాలను కూడా బయటపెట్టింది.

“నా పేరు పక్కన మా నాన్న ఇంటి పేరు తీసేయ్యాలని చాలా కాలం క్రితం నుంచి అనుకుంటున్నాను. మనల్ని స్కూల్లో చేరిపించినప్పుడు ఇంటిపేరుతో సహా మన పేరు రాస్తుంటారు. అలాగే నాక్కూడా సంయుక్త మీనన్ అనే పేరు నమోదు చేశారు. అప్పట్లో దాని గురించి అంతగా అవగహన లేదు. రాను రాను.. ఒక వ్యక్తి పేరు వెనక ఎందుకు ఇలాంటి తోకలు ఉండాలి ? అనే ఆలోచన నాలో మొదలైంది. నటికి ఉండాల్సిన బాధ్యతలు గ్రహించిన తర్వాత ఇంటిపేరును కొనసాగించకూడదని అనుకుంటున్నాను. అంతేకాకుండా.. చాలా కాలం క్రితమే నా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. మా నాన్న ఇంటి పేరును కొనసాగించడం అమ్మకు ఇష్టంలేదు. నా తల్లి బావాలను గౌరవించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాను. నా సోషల్ మీడియా ఖాతాలు.. నేను నటించే సినిమాల్లోనూ సంయుక్తగానే ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

“మన చుట్టూ సమానత్వం, మానవత్వం, ప్రేమ చూడాలనుకున్నప్పుడు ఇంటిపేరును ఉంచుకోవడం అనేది నేను కోరుకుంటున్నవాటికి విరుద్ధంగా ఉంటుంది. నేనెప్పటికీ నా తల్లి భావాలను గౌరవిస్తాను. ఇప్పటివరకు నా కెరీర్ మొదలైన నాటి నుంచి విభిన్నమైన పాత్రలు చేస్తున్నా.. ఇప్పుడు సార్ చిత్రంలోనూ నా పాత్ర అద్భుతంగా ఉంటుంది. అందర్నీ అలరిస్తుంది. నా పాత్రకు ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి వ్యక్తిగతంగా అనేక కష్టాలను ఎదుర్కొన్నాను. అందుకే ఎమోషనల్ సీన్స్ చేసేప్పుడు నాకు కష్టంగా అనిపించలేదు” అని అన్నారు.

View this post on Instagram

A post shared by Samyuktha (@iamsamyuktha_)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!