Sai Pallavi : మరో క్రేజీ మూవీలో ఫిదా బ్యూటీ.. కోలీవుడ్ స్టార్ హీరోకు జోడీగా సాయి పల్లవి..

అందాల భామ సాయి పల్లవి(Sai Pallavi )గురించి పరిచయం అవసరం లేదు. నటనతో అందంతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.

Sai Pallavi : మరో క్రేజీ మూవీలో ఫిదా బ్యూటీ.. కోలీవుడ్ స్టార్ హీరోకు జోడీగా సాయి పల్లవి..
Sai Pallavi
Follow us

|

Updated on: May 21, 2022 | 7:32 AM

అందాల భామ సాయి పల్లవి(Sai Pallavi )గురించి పరిచయం అవసరం లేదు. నటనతో అందంతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. మలయాళ సినిమా ప్రేమమ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆతర్వాత తెలుగులో ఫిదా సినిమాతో పరిచయం అయ్యింది. అచ్చం పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించే సాయి పల్లవి తొలి తెలుగు సినిమాతోనే ఇక్కడి ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ .. గ్లామర్ షో కు దూరంగా ఉంటూ.. కెరీర్ లో దూసుకుపోతుంది ఈ భామ. ఇప్పటికే తెలుగు , తమిళ్ , మలయాళ సినిమాల్లో సత్తా చాటింది సాయి పల్లవి. ఇటీవలే తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాతో హిట్ కొట్టింది. త్వరలో రానా హీరోగా రానున్న విరాట పర్వం సినిమాలోనూ సాయి పల్లవి నటించింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది కోలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేస్తుందని తెలుస్తుంది. తమిళ్ హీరో శివ కార్తికేయన్ వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. రీసెంట్ గా డాన్ సినిమాతో హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ కుర్ర హీరోకు జోడీగా సాయి పల్లవి నటిస్తుందని తెలుస్తుంది. సోనీ పిక్చర్స్ తో కలిసి కమల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘మావీరన్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని తెలుస్తుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. హారిస్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

kangana Raunaut: ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేసిన కంగనా రనౌత్.. దాని ధర ఎంతంటే..?

NTR Movie: 20ఏళ్ల కల నెరవేరిందంటున్న కేజీఎఫ్‌ డైరెక్టర్‌..ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..ట్విట్స్‌ వైరల్‌

JR. NTR Fans Hungama: అర్ధరాత్రి ఎన్టీఆర్‌ ఇంటి వద్ద అసలేం జరిగింది..? పోలీసు లాఠీ ఛార్జ్‌ ముందు పరిస్థితి ఎంటీ..? వీడియోలు వైరల్‌