AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: తొలిప్రేమపై న్యాచురల్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. రానా రియాక్షన్స్ చూస్తే నవ్వాగదు..

తాను నటించిన విరాట పర్వం సినిమా ప్రమోషన్లలో భాగంగా రానా, సాయి పల్లవి హైవే ముచ్చట్లు అంటూ ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు. తాజాగా

Sai Pallavi: తొలిప్రేమపై న్యాచురల్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. రానా రియాక్షన్స్ చూస్తే నవ్వాగదు..
Virata Parwam
Rajitha Chanti
|

Updated on: Jun 12, 2022 | 11:40 AM

Share

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి (Sai Pallavi) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకుల మనసులు దొచుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. ప్రాధాన్యత ఉన్న రోల్స్ ఎంచుకుంటూ సినీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్‏గా ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ చిన్నది. నెమిలిలా నాట్యం చేస్తూ.. సహజంగా కనిపిస్తూ.. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది సాయి పల్లవి. పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎంత పెద్ద సినిమా అయిన సులభంగా తిరస్కరించేస్తుంది.. అబద్ధాలను ప్రచారం చేయనంటూ ఏకంగా కోట్ల ఆఫర్ వచ్చిన యాడ్ కూడా నో చెప్పిందంటే సాయి పల్లవి మనస్తత్వం ఏలాంటిదో అర్థం చేసుకోవచ్చు. యూత్‏లో ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ వేరు.. సాయి పల్లవి స్పీచ్ కోసం అభిమానులు వెయిట్ చేస్తుంటారు. ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితం గురించి స్పందించని సాయి పల్లవి తాజాగా తన ప్రేమ విషయం బయటపెట్టింది.

తాను నటించిన విరాట పర్వం సినిమా ప్రమోషన్లలో భాగంగా రానా, సాయి పల్లవి హైవే ముచ్చట్లు అంటూ ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో రానా, సాయి పల్లవి విరాటపర్వం సినిమాపై.. తమ వ్యక్తిగత జీవితాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో తన జీవితంలో ఉన్న ప్రేమ గురించి చెప్పమని అడగ్గా.. దానిని ప్రేమ అని అనలేమంటూ, చిన్న కన్ఫ్యూజన్‌గా సమాధానం ఇచ్చింది. వెజిటేరియన్ అయినా.. ఒకరి కోసం చికెన్ కొని.. మరోకరి సాయంతో వంటచేసి.. వారికి ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది.. కానీ, అది ఎవరు అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు సాయి పల్లవి.. ఆమె మాట్లాడుతున్న సమయంలో రానా పడి పడి నవ్వేశాడు.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాట పర్వం సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో నక్సలైట్ రవన్న పాత్రలో రానా నటించగా.. వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటించింది.

మరిన్ని ఎంటర్‏టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us