Ruhani Sharma: భారతీయ సినిమాలో ఓ విస్పోటనం.. పుష్ప 2 పై హీరోయిన్ రుహానీ శర్మ రివ్యూ..

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్‏తో దూసుకుపోతుంది పుష్ప 2. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ సినిమా ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చింది. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ మూడేళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం కనిపిస్తుంది.

Ruhani Sharma: భారతీయ సినిమాలో ఓ విస్పోటనం.. పుష్ప 2 పై హీరోయిన్ రుహానీ శర్మ రివ్యూ..
Ruhani Sharma
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 06, 2024 | 3:16 PM

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 చిత్రం ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ఎప్పుడెప్పుడా అంటూ వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా ఇప్పుడు విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతుంది. ఈ చిత్రానికి మొదటి నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. దాదాపు మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో పుష్ప 2 పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇప్పుడు విడుదలైన పుష్ప ది రూల్ చిత్రం అడియన్స్ అంచనాలకు మించిపోయిందని.. బన్నీ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ అని , సుకుమార్ అద్భుతం సృష్టించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ఈ చిత్రంపై రియాక్ట్ అవుతున్నారు. డైరెక్టర్ అట్లీ, హరీష్ శంకర్ తదితరులు పుష్ప 2 చిత్రయూనిట్ ను పొగడ్తలతో ముంచెత్తారు. తాజాగా హీరోయిన్ రుహానీ శర్మ సైతం పుష్ప 2 పై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది.

‘పుష్ప 2 సినిమా చూసిన తర్వాత నేను ఎలా ఫీల్ అయ్యానో చెప్పడానికి పదాలు దొరకడం లేదు. భారతీయ సినిమా హద్దులు దాటటం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఓ ముద్ర వేసింది. ఇండియన్ సినిమాను పుష్ప 2 ఆకాశమంత ఎత్తుకు పెంచింది. మన సినిమా పుష్ప 2 వల్ల వెలిగి పోవడంతో నటిగా నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలకు అర్హులు. భారతీయ సినిమా ఒక విస్ఫోటనంను సుక్కు సర్ సృష్టించారు. మీ మేధస్సుకు పెద్ద అభిమానిని. ప్రతి సన్నివేశంలోనూ అల్లు అర్జున్ సర్ యాక్టింగ్ అద్భుతం.

స్క్రీన్ పై మీ నటన చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. మీ కళ్లు మాడాడుతూ నటించాయి. మీ నటనకు అన్ని అవార్డులు రావాల్సిందే. పుష్ప రాజ్ ఒక పాత్ర మాత్రమే కాకుండా ఒక గొప్ప విషయం అన్నట్లుగా మీరు ఆ పాత్రను నిలబెట్టారు” అంటూ ట్వీట్ చేసింది. అలాగే రష్మిక మందన్నా యాక్టింగ్, ఫహద్ ఫాసిల్ ఎంట్రీ పై అదిరిపోయిందంటూ ట్వీట్ చేసింది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.