Rashmika Mandanna: స్పీడ్ పెంచిన రష్మిక మందన్న.. ఇప్పుడు భయపెట్టడానికి రెడీ అవుతున్న ముద్దుగుమ్మ

|

Aug 30, 2024 | 8:30 PM

బాలీవుడ్‌లో హారర్ సినిమాలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు రష్మిక మందన్న కూడా ఓ హారర్ మూవీ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Rashmika Mandanna: స్పీడ్ పెంచిన రష్మిక మందన్న.. ఇప్పుడు భయపెట్టడానికి రెడీ అవుతున్న ముద్దుగుమ్మ
Rashmika Mandanna
Follow us on

ఇటీవల హారర్ సినిమాలు మంది విజయాలు సాధిస్తున్నాయి. అజయ్ దేవగన్ నటించిన ‘షైతాన్’ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఆ తర్వాత విడుదలైన ‘ముంజ్యా’ చిత్రం కూడా విజయం సాధించింది. ఇప్పుడు ‘స్త్రీ 2’ సినిమా కూడా విడుదలై విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో బాలీవుడ్‌లో హారర్ సినిమాలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు రష్మిక మందన్న కూడా ఓ హారర్ మూవీ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే అక్కడ యానిమల్ సినిమాతో భారీ హిట్ అందుకుంది.

రష్మిక మందన్న ఇప్పుడు మరో హిందీ చిత్రాన్ని అంగీకరించింది. ఈ చిత్రానికి ‘వ్యాంపైర్ ఆఫ్ విజయనగర’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. విజయనగర పిశాచం అని అర్థం. హారర్‌ కామెడీ స్టైల్‌లో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఆదిత్య సర్పోత్‌దత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆదిత్య సర్పోత్‌దత్ ‘ముంజ్యా’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించనున్నారు.

ఆయుష్మాన్ ఖురానా ఇంతకు ముందు చాలా కామెడీ సినిమాలు చేసారు. ఇందులో ‘డ్రీమ్‌గర్ల్‌’ ఒకటి.  ఇప్పుడు ఈ హారర్ జానర్ సినిమా చేస్తున్నాడు. ఈ హారర్ సినిమా కథ కర్ణాటకలో జరుగుతుందని తెలుస్తోంది. సినిమా కథ రెండు కాలాల్లో సాగుతుందని. విజయనగర రాష్ట్రం హంపిలో ఒక కథ జరుగుతుంది. మరో కథ ఉత్తర భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది టాక్. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. రష్మిక మందన్న పాత్ర ఈ సినిమాలో హైలైట్ గా ఉంటుందట. ప్రస్తుతం రష్మిక మందన్న చేతిలో చాలా సినిమాలున్నాయి. ‘పుష్ప 2’, ‘చావా’ సినిమాల పనుల్లో బిజీగా ఉంది. ఈ రెండు సినిమాలు డిసెంబర్ 6న విడుదల కానున్నాయి. దీంతో పాటు సల్మాన్‌ఖాన్‌ హీరోగా ‘సికిందర్’ సినిమా చేస్తోంది. ధనుష్ నటిస్తున్న కుబేర సినిమా కూడా చేస్తోంది. వీటితో పాటు ఈ బ్యూటీ చేతిలో మరో సినిమా కూడా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.