Pooja Hegde: చీరకట్టులో తళుక్కుమన్న అందాల బుట్టబొమ్మ.. నీ అందానికి ఫిదా కాకుండా ఉండేదెవరమ్మా..

Pooja Hegde: ఏమంటూ 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైందో, అప్పటి నుంచి కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకుంది అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. తొలి సినిమాలోనే...

Pooja Hegde: చీరకట్టులో తళుక్కుమన్న అందాల బుట్టబొమ్మ.. నీ అందానికి ఫిదా కాకుండా ఉండేదెవరమ్మా..

Pooja Hegde: ఏమంటూ ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైందో, అప్పటి నుంచి కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకుంది అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. తొలి సినిమాలోనే తన అందం, అభినయంతో మెస్మరైజ్‌ చేసిన ఈ చిన్నది అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చేరింది. చేసిన సినిమాలన్నీ సూపర్‌ హిట్‌ కావడంతో ఈ అమ్మడు హీరోలకు లక్కీ హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు యంగ్‌ టాప్‌ హీరోల సరసన ఆడిపాడిన ఈ చిన్నది ఇప్పుడు అందరికీ హాట్‌ ఫేవరేట్‌గా మారింది. చేసినవి కొన్ని సినిమాలే అయినా ఎక్కడ లేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆచార్య, బీస్ట్‌, రాదేశ్యామ్‌ వంటి అత్యంత భారీ బడ్జెట్‌ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోందీ చిన్నది.

ఇక పూజా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రాల్లో ‘అల వైకుంఠపురములో’ ఒకటి. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో పూజా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన సినీ అవార్డుల ప్రధానోత్సవంలో ‘అల వైకుంఠపుమరులో’ చిత్రానికి అవార్డుల పంట పండింది.

ఇందులో పూజా ఉత్తమ హీరోయిన్‌గా అవార్డును అందుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన సమయంలోనే పూజా హెగ్డే నారింజ రంగు చీరలో తళుక్కుమంది. ఈ ఫొటోలను అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా పోస్ట్‌ చేసిందో లేదో.. అలా ఆమె అభిమానులు లైక్‌లతో హోరెత్తిస్తున్నారు. ట్రెండీ శారీ లుక్‌లో కుర్రకారును ఒక్కసారిగా తనవైపు తిప్పుకుందీ బ్యూటీ. మరి పూజా లేటెస్ట్‌ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Also Read: Samantha: అన్ని పుకార్లను సమంత ఒక్క ట్వీట్‌తో పటా పంచలు చేసిందా.! ఇంతకీ సామ్‌ చేసిన ఆ ట్వీట్ ఏంటో తెలుసా.?

వీకెండ్ పార్టీలో స్టార్ హీరోయిన్స్ రచ్చ.. ఒకే ఫ్రేమ్‏లో సమంత.. కీర్తి.. త్రిష.. గులాబీలతో ఫోజులు..

Online Cinema Tickets: త్వరలోనే ఏపీలో ఆన్‌లైన్ పద్దతిలో సినిమా టిక్కెట్లు.. చర్చల అనంతరం మంత్రి కీలక ప్రకటన

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu