Malavika Mohanan: ప్రభాస్ కోసం మిగిలిన ఆఫర్స్ వదులుకొని వెయిట్ చేస్తుందట ఈ బ్యూటీ

అందం అభినయం కలబోసినా కుందనపు బొమ్మ మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Malavika Mohanan: ప్రభాస్ కోసం మిగిలిన ఆఫర్స్ వదులుకొని వెయిట్ చేస్తుందట ఈ బ్యూటీ
Malavika
Follow us

|

Updated on: May 25, 2022 | 1:46 PM

అందం అభినయం కలబోసిన కుందనపు బొమ్మ మాళవిక మోహనన్(Malavika Mohanan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట సినిమాతో పరిచయం అయ్యింది మాళవిక. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. పేట సినిమా తర్వాత దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. మాస్టర్ మూవీ హిట్ తో ఈ అమ్మడుకి అవకాశాలు క్యూ కట్టాయి. రీసెంట్ గా ధనుష్ హీరోగా వచ్చిన సినిమాలో నటించింది. ఈ మూడు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ మాళవికాకు మాత్రం చెప్పుకోదగ్గ పేరు రాలేదని టాక్ వినిపిస్తుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన మాళవికకు కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు క్రేజీ ఆఫర్లే లభించాయి.

అందాల ఆరబోతలో వెనకాడని ఈ చిన్నదానికి సాలిడ్ హిట్ పడాలని కోరుకుంటున్నారు ఈ అమ్మడి అభిమానులు. మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను పలకరిస్తూ ఉంటుంది ఈ చిన్నది. తాజాగా ఈ అమ్మడు ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. వార్తలు చక్కర్లు కొడుతుంది. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు డార్లింగ్.. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. అయితే ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని టాక్. ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని టాక్. తెలుగు ప్రాజెక్టులు ఎన్ని వచ్చినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఆసక్తి చూపని ఈ బ్యూటీ ప్రభాస్ సినిమాకోసం ఎదురుచూస్తుందట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Sunil : అప్పట్లో రాఘవేంద్ర రావు.. ఇప్పుడు అనిల్ రావిపూడి మాత్రమే.. సునీల్ ఆసక్తికర కామెంట్స్

F3 Movie: డబ్బు విషయంలో వెంకటేష్ ఫిలాసపీ అదుర్స్‌.. ఏమన్నారంటే..