పవన్ కోసం 19 ఏళ్ల క్రితమే ప్రేమ కవిత రాసిన హీరోయిన్…చూస్తారా?

పవన్ కోసం 19 ఏళ్ల క్రితమే ప్రేమ కవిత రాసిన హీరోయిన్...చూస్తారా?
maadhavi latha love letter to Pawan Kalyan

పవన్ కళ్యాన్..ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్థాయి వేరు, స్టానం వేరు. ఆయనకు ఫ్యాన్స్ ఉండరు..భక్తులు ఉంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక అమ్మాయిలు అయితే పవన్ అంటే పడి చచ్చిపోతారు. పవర్ స్టార్‌ను అభిమానించే సెలబ్రిటీల గురించి చెప్పాలంటే చాంతాడంత ఉంటుంది. కానీ ఇప్పుడు ఇప్పుడు మనం పవన్‌ని అభిమానించే, ప్రేమించే ఓ లేడీ సెలబ్రిటీ గురించి స్పెషల్‌గా మాట్లాడుకోవాలి. ఆమె నటి, బీజేపీ నేత మాధవీలత. పవర్ […]

Ram Naramaneni

|

Sep 08, 2019 | 9:35 PM

పవన్ కళ్యాన్..ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్థాయి వేరు, స్టానం వేరు. ఆయనకు ఫ్యాన్స్ ఉండరు..భక్తులు ఉంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక అమ్మాయిలు అయితే పవన్ అంటే పడి చచ్చిపోతారు. పవర్ స్టార్‌ను అభిమానించే సెలబ్రిటీల గురించి చెప్పాలంటే చాంతాడంత ఉంటుంది.

కానీ ఇప్పుడు ఇప్పుడు మనం పవన్‌ని అభిమానించే, ప్రేమించే ఓ లేడీ సెలబ్రిటీ గురించి స్పెషల్‌గా మాట్లాడుకోవాలి. ఆమె నటి, బీజేపీ నేత మాధవీలత. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఆమె వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. బీజేపీలో చేరినప్పటికీ.. పవన్ కళ్యాణ్‌పై ఆమెకున్న అభిమానం ఏ మాత్రం తగ్గలేదు. పవన్‌ కళ్యాణ్‌కు రాసిన ప్రేమ కవితలను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. కానీ ఆ ప్రేమ కవిత ఇప్పటిది కాదు, 19 ఏళ్ల క్రితం నాటిది. 2000వ సంవత్సరం జూన్ 6న పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తాను రాసుకున్న ప్రేమ కవితను మాధవీలత ఫేస్ బుక్‌లో పంచుకున్నారు.

‘మనసులో ఏదో వేదన
కారణం తెలియక పడుతున్నా తపన

హృదయంలో అనురాగం అనే భావన
దానికో రూపం ఇచ్చేందుకే ఈ సాధన

నీవు కనిపించగానే నా హృదయంలో ఏదో బాధ
నా మనస్సుని ఎవరో గట్టిగా పట్టేసినట్టుగా వేదన

ఒకపక్క సంతోషం, మరోపక్క దుఃఖం కానీ,…. కానీ ఎందుకో తెలీదు
నిను చూస్తున్న ప్రతీక్షణం నేను కారణం చెప్పలేని భావాలలో విలవిల్లాడిపోతాను. దానికి అర్థం ఏంటి? నేను ఎందుకిలా అవుతున్నాను?

ఇది ఆకర్షణా? ప్రేమ అనే వ్యామోహమా?
No. కానే కాదు. అటువంటిది కాదు. మరేంటి?…..’

అంటూ తన మనసులోని భావాలను పవన్ కళ్యాన్ కోసం స్కూల్లో ఉన్నప్పుడే ఓ నోట్స్‌ రాసి దాచుకుంది ఈ తెలుగు హీరోయిన్.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu