
ఇప్పుడు సినీ పరిశ్రమలో నవతరం కథానాయికల జోరు నడుస్తోంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. వరుస ఆఫర్లను అందుకుంటూ దక్షిణాది చిత్రపరిశ్రమలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యి.. వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో సత్తా చాటుతున్నారు యువ కథానాయికలు కృతి శెట్టి, శ్రీలీల.. ఇప్పుడు వెండితెరపై మరో హీరోయిన్ ప్రేక్షకులను అలరించబోతుంది. తనే ఐశ్వర్య లక్ష్మీ.
వైవిధ్యభరితమైన చిత్రాలను ఎంచుకుంటూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో సత్యదేవ్. ఇప్పుడు ఈ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం గాడ్సే. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ జూన్ 17న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఇతర ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించింది. ఈ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కాబోతుంది ఐశ్వర్య. గాడ్సే సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటించింది.
ఐశ్వర్య లక్ష్మీ మాట్లాడుతూ.. ” నేను హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి మూడేళ్లు అవుతుంది. నా తొలి చిత్రాన్ని మలయాళంలో చేశాను. రెండో చిత్రాన్ని తెలుగులోనే చేయాల్సింది. కానీ కుదరలేదు. తర్వాత దర్శక నిర్మాతలు అనుకున్న పాత్రలకు నేను సూట్ కాకపోయి ఉండొచ్చు. వచ్చిన పాత్రలు నాకు నచ్చలేదు.. ఇలా పలు కారణాలతో తెలుగులో సినిమాలు చేయలేకపోయాను. రెండో సినిమాలో ఇక్కడ ప్రేక్షకులను పలకరించాల్సిన నేను 15 సినిమాగా చేస్తోన్న ‘గాడ్సే’తో పలకరించబోతున్నాను. తెలుగులో నా తొలి చిత్రం ‘గాడ్సే’ ఇందులో వైశాలి అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపిస్తాను. నటిగా నన్ను నేను ఎలివేట్ చేసుకోవటానికి చాలా స్కోప్ ఉన్న రోల్ చేశాను. నిజ జీవితంలో చాలా విషయాలను పట్టించుకోకుండా కూల్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాను. కానీ ‘గాడ్సే’లో రియల్ లైఫ్‌కు విరుద్ధమైన పాత్రలో నటించాను. కథ వినగానే డిఫరెంట్‌గా అనిపించటంతో సినిమాలో నటించటానికి ఓకే చెప్పాను. తెలుగులో నటించటం తొలిసారి కావటంతో నటిగా చాలా హోం వర్క్ చేశాను. డైలాగ్స్‌తో పాటు ఎమోషన్స్‌పై కాన్‌సన్‌ట్రేషన్ చేశాను. ఏదో డబ్బింగ్‌లో చూసుకుందాంలే అని యాక్ట్ చేయలేదు. అలా చేయను కూడా. ఇలాంటి ఓ ఇన్‌టెన్స్ మూవీలో యాక్ట్ చేయటం హ్యాపీగా అనిపించింది.
గాడ్సే’ సినిమాకు ముందు నేను రెగ్యులర్‌గా పేపర్స్ చదివేదాన్ని కాదు. కానీ ఇంతకు ముందు చెప్పినట్లు వైశాలి పాత్ర కోసం.. మన సోసైటీలో ఏం జరుగుతుందనే విషయాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో పేపర్ చదవటం దినచర్యగా పెట్టుకున్నాను. అలా ప్రిపేర్ అయ్యాను. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ పాత్రలో నేను ఒదిగిపోవటానికి బాగా సపోర్ట్ చేశారు. మణిరత్నంగారు రూపొందిస్తోన్న ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో చాలా మంచి రోల్ చేశాను. సెప్టెంబర్‌లో సినిమా రిలీజ్ కానుంది. టీజర్, ట్రైలర్ అన్ని త్వరలోనే విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ తరహా పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను. ఇప్పట్లో నెగిటివ్ టచ్ పాత్రల్లో నటించాలని అనుకోవటం లేదు” అని అన్నారు.
మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.