Vishal : జోరు పెంచిన విశాల్.. చేతినిండా సినిమాలతో బిజీ బిజీ .. త్వరలోనే షూటింగ్ కు

తమిళ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశాల్. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో  ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

Vishal : జోరు పెంచిన విశాల్.. చేతినిండా సినిమాలతో బిజీ బిజీ .. త్వరలోనే షూటింగ్ కు
Follow us

|

Updated on: Jun 16, 2021 | 9:08 AM

Vishal :

తమిళ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశాల్. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో  ప్రేక్షకులను అలరిస్తున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విశాల్. ఇటీవలే చక్ర సైనికామతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. . తాజాగా ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు.  ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విశాల్ కెరియర్ లో 31వ మూవీగా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన విశాల్ ప్రీలుక్ సినిమా పై ఆసక్తి రేపింది. అలాగే ప్రీలుక్ తో పాటుగా ఇంట్రెస్టింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమా నిర్మిస్తుండగా టిపి శరవణన్ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలోఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాకు సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. కరోనా నిబంధనలు పాటిస్తూ..షూటింగ్ జరుపుతున్నారు మేకర్స్. హైదరాబాద్ లోనే షూటింగ్ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. జులై చివరి లోగా పూర్తి షూటింగ్ కంప్లీట్ అవుతుందని విశాల్ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. విశాల్  తుప్పరివాలన్ సీక్వెల్ – ఎనిమి – ఇరుంబుతురై సీక్వెల్ సినిమాలు చేస్తున్నాడు. ఇలా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు విశాల్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Akhil Akkineni : ఒక్క సాలిడ్ హిట్ పడితే మా హీరో స్టార్ గా మారిపోతాడంటున్న అక్కినేని అభిమానులు..

Pranitha: పెళ్లి సింపుల్‌గా చేసుకున్నాం.. రిసిప్ష‌న్ మాత్రం గ్రాండ్‌గా చేస్తాం. వివాహంపై స్పందించిన‌ ప్ర‌ణీత‌.

Jagame Thanthiram: ఆస‌క్తిరేకెత్తిస్తోన్న ధ‌నుష్ కొత్త చిత్రం… 17 భాష‌లు, 190 దేశాల్లో విడుద‌ల‌..