Srikanth: బాలయ్య పక్కన నటించాలంటే భయపడ్డాను.. శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Srikanth: బాలయ్య పక్కన నటించాలంటే భయపడ్డాను.. శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Actor Srikanth


Akhanda: నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో శ్రీకాంత్మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేశాను. సక్సెస్ అయ్యాను. హీరోగా చేశాను. మధ్యలో మళ్లీ విలన్‌గా చేశాను. యుద్దం శరణం అనే సినిమాలో విలన్‌గా చేశాను. మీరు ఏది పడితే అది చేయకండని దాని కంటే ముందే బోయపాటి గారు అన్నారు. సరైనోడు సినిమాలో మంచి సాఫ్ట్ కారెక్టర్ ఇచ్చారు. మంచి విలన్ పాత్రను రాస్తాను వేస్తారా? అని అడిగారు. నేను అక్కడి నుంచే వచ్చాను.. ఎందుకు చేయను భయ్యా అని అన్నాను. అలా కొన్ని రోజులు ఎదురుచూశాను. అలా ఓ సారి బాలయ్య బాబు అఖండ కోసం విలన్ కారెక్టర్ చెప్పారు. విన్న వెంటనే భయపడ్డాను. వరదరాజులు కారెక్టర్‌కు న్యాయం చేయగలనా? అని అనుకున్నాను. ఎందుకంటే బాలయ్య, బోయపాటి సినిమాలో విలన్ అంటే మామూలుగా ఉండదు. ముందు గెటప్ సెట్ అయితే బాగుంటుందని అనుకున్నాం. ఎన్నో రకరకాలుగా ట్రై చేశాం. కానీ సహజంగా, సింపుల్‌గా పెట్టేద్దామని అన్నారు. అలా గడ్డంతో చూసే సరికి నేనేనా? అనుకున్నాను అని అన్నారు.

నా గెటప్ చూసి అందరూ ఫోన్లు చేశారు. ప్రశసించారు. కానీ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాను. కొత్త శ్రీకాంత్ కనిపిస్తాడు. నాక్కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. వరదరాజులు పాత్ర చాలా బాగా వచ్చింది. బాలయ్య గారితో శ్రీరామారాజ్యం సినిమాలో నటించాను. అందులో లక్ష్మణుడి పాత్రలో తమ్ముడిగా కనిపిస్తే ఇందులో రావణాసురుడి పాత్రలో కనిపిస్తాను. ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. శ్రీకాంత్ పాత్ర అదిరిపోవాలి. అప్పుడు మన పాత్ర కూడా బాగా వస్తుందంటూ బోయపాటి గారికి చెబుతూ ఉండేవారు. క్రికెట్ ఆడే సమయం నుంచి ఆయనతో మంచి ర్యాపో ఉంది. లెజెండ్ సినిమా జగపతి బాబుకు ఎంత ప్లస్ అయిందో నాకు తెలుసు. ఇప్పటికీ మంచి స్థానంలో ఉన్నారు. నాకూ అలా ఉంటుందని నేను అనుకోను. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. దర్శక నిర్మాతలు ఎలాంటి పాత్రలు ఇస్తారో చూడాలి. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియెన్స్‌లో అంచనాలుంటాయి. ముఖ్యంగా ఇందులో డైలాగ్స్ అద్బుతంగా ఉంటాయి. బాలయ్య గారి దగ్గరి నుంచి ప్రేక్షకులు కోరుకునేదే అది. ఇందులో సెంటిమెంట్ కూడా ప్రధాన పాత్రను పోషిస్తుంది అన్నారు. ఓ పక్కన హీరోగా, విలన్‌గా నటిస్తున్నాను ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమాలోనూ పాత్రను పోషిస్తున్నాను. మంచి పాత్ర వస్తే చేయాలని నిర్ణయించుకున్నాను అని అన్నారు శ్రీకాంత్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

SS Rajamouli : ఆర్ఆర్ఆర్ సీన్ల‌ను లోతుగా చూస్తే ఎలా ఉంటుందో జ‌న‌ని పాట అలా ఉంటుంది : రాజమౌళి

Alia Bhatt: నెటిజన్ల మనసు గెల్చుకున్న అలియా.. అభిమానిని గుర్తు పెట్టుకుని పలకరించిన బాలీవుడ్‌ నటి..

Ananya Panday : లాస్‌ వేగాస్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న లైగర్‌.. ఫొటోలు షేర్‌ చేసిన అనన్య..

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu