Rajinikanth: సూపర్ స్టార్‌కు విలన్‌గా మరో స్టార్ హీరో.. జైలర్ 2కోసం రంగంలో ఆయన

|

Sep 23, 2024 | 6:48 PM

ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న సినిమా వెట్టయన్. జై భీమ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, తుషార విజయన్, రితికా సింగ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Rajinikanth: సూపర్ స్టార్‌కు విలన్‌గా మరో స్టార్ హీరో.. జైలర్ 2కోసం రంగంలో ఆయన
Rajinikanth
Follow us on

సూపర్ స్టార్ రజినీకాంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. జైలర్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ వరుస సినిమాలను లైనప్ చేశారు. ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న సినిమా వెట్టయన్. జై భీమ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, తుషార విజయన్, రితికా సింగ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. చిత్రాన్ని అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది..

ఇది కూడా చదవండి : మహానటి సావిత్రితో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టారా.?

యాంటీ ఫేక్ ఎన్‌కౌంటర్ కథాంశంతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అలాగే, విద్యా విధానానికి అనుకూలంగా అనేక అభిప్రాయాలను ఈ చిత్రంలో ప్రదర్శించినట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు, సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇదిలా రజినీకాంత్ జైలర్ 2 సినిమాను కూడా లైనప్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు హుకుం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ఇది కూడా చదవండి :ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

ఇదిలా ఉంటే జైలర్ సినిమాలో విలన్ గా వినాయకన్ నటించిన విషయం తెలిసిందే. అయితే వినాయకన్ ఇప్పుడు వివాదంలో చుక్కుకున్నాడు. అతన్ని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లిన వినాయకన్ అక్కడ భద్రతా విధుల్లో ఉన్న సీఐఎస్ ఎఫ్ జవాన్లతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఇక ఇప్పుడు జైలర్ 2 సినిమాలో మలయాళ స్టార్ హీరో.. మమ్ముట్టి విలన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవలే మమ్ముట్టితో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఇక జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ గెస్ట్ రోల్స్ లో నటించిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్‌లో మరోసారి ఆ ముద్దుగుమ్మ.. ఈసారి రచ్చ రచ్చ ఖాయం అంటున్నారే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.