Arjun Sarja: సినిమా తారలను వదలని మహమ్మారి.. యాక్షన్ కింగ్ అర్జున్‌కు కరోనా పాజిటివ్..

కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా వదిలిపోలేదు.. నక్కి నక్కి ఒకోకరు మీద దాడి చేస్తూనే ఉంది.. కరోనా భారిన పడుతున్న వారి కేసులు కొద్దికొద్దిగా పెరుగుతున్నాయి.

Arjun Sarja: సినిమా తారలను వదలని మహమ్మారి.. యాక్షన్ కింగ్ అర్జున్‌కు కరోనా పాజిటివ్..
Arjun
Follow us

|

Updated on: Dec 14, 2021 | 11:08 AM

Arjun Sarja: కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా వదిలిపోలేదు.. నక్కి నక్కి ఒకోకరు మీద దాడి చేస్తూనే ఉంది.. కరోనా భారిన పడుతున్న వారి కేసులు కొద్దికొద్దిగా పెరుగుతున్నాయి. సామాన్యుల  దగ్గర నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రెటీల వరకు అందరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే సినిమాతరలు పలువురు కరోనా భారిన పడిన విషయం తెలిసిందే.. ఎస్పీ బాలులాంటి లెజెండ్స్ ను మనకు కాకుండా కూడా చేసింది ఈ మాయదారి వైరస్. ఇదిలా ఉంటే ఇప్పటికీ పలువురు సినిమా తారలు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కరోనా నుంచి బయటపడ్డారు. రీసెంట్ గా బాలీవుడ్ నటి కరీనా కపూర్ కు కూడా కరోనా సోకింది. ఈ క్రమంలో తాజాగా మరో నటుడు కరోనా బారిన పడ్డారు.

యాక్షన్ కింగ్ అర్జున్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల ఆయన వైద్య పరీక్షలు చేయిన్చుకోగా ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్నీ అర్జున్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ” నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహాలు సూచనలు  తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా.. గత కొద్దిరోజుల ముందు నన్ను కలిసిన వారందరు దాచేసి కరోనా టెస్ట్ చేయింకోవాలని కోరుతున్నా.. నేను బాగానే ఉన్నా అందరు జాగ్రత్తగా ఉండండి.. మాస్క్ తప్పనిసరిగా ధరించండి.. రామ భక్తహనుమాన్ కి జై”  అంటూ రాసుకొచ్చారు అర్జున్.. ప్రస్తుతం అర్జున్, తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vikrant Rona: 14 భాషల్లో 55 దేశాల్లో రిలీజ్ కానున్న క‌న్న‌డ బాద్ షా కిచ్చ సుదీప్ సినిమా..!!

AHA Studio: మరో ముందడుగు వేసిన ఆహా.. ఇకపై ఆహా స్టూడియో ద్వారా పాన్‌ ఇండియా వెబ్‌ సిరీస్‌లు..

Allu Arjun: ‘మీరు నాపై చూపిస్తున్న ప్రేమే నా అతి పెద్ద ఆస్తి’.. ఫ్యాన్స్‌ గాయపపడంపై స్పందించిన బన్నీ..