‘శ‌శి’ టీజ‌ర్‌‌‌‌ను లాంచ్ చేసిన చిరంజీవి.. సినిమా అద్భుత విజయాన్ని అందుకోవలంటూ విషెస్ చెప్పిన మెగాస్టార్..!

ఆది సాయికుమార్ హీరోగా నూతన దర్శకుడు శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'శ‌శి'. సుర‌భి నాయిక‌గా న‌టిస్తోన్న..

'శ‌శి' టీజ‌ర్‌‌‌‌ను లాంచ్ చేసిన చిరంజీవి.. సినిమా అద్భుత విజయాన్ని అందుకోవలంటూ విషెస్ చెప్పిన మెగాస్టార్..!
Follow us

|

Updated on: Dec 23, 2020 | 7:51 PM

Sasi Teaser Released: ఆది సాయికుమార్ హీరోగా నూతన దర్శకుడు శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘శ‌శి’. సుర‌భి నాయిక‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్‌.పి. వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు నిర్మిస్తున్నారు. ల‌వ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది.బుధ‌వారం ఆది సాయికుమార్ బ‌ర్త్‌డే.. ఈ సందర్భంగా సినిమా టీజర్‌ మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా విడుద‌ల‌య్యింది.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, “నా మిత్రుడు సాయికుమార్ త‌న‌యుడు ఆది హీరోగా న‌టించిన చిత్రం ‘శశి’. టీజ‌ర్ చూస్తుంటే చాలా ర‌గ్డ్ ల‌వ్ స్టోరీలా అనిపిస్తోంది. ఇప్పటివ‌ర‌కూ ఆది ఓ స్వీట్ ల‌వ‌ర్ బాయ్ లాగా, ఓ చాక్లెట్ బాయ్ లాగా క‌నిపించాడు. ‘శ‌శి’ టీజ‌ర్‌లో అత‌డిని చూస్తుంటే.. మ్యాచోగా, దృఢ‌మైన బాడీతో చాలా బాగా క‌నిపిస్తున్నాడు. మంచి ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌. ఈ సినిమాతో ఆది క‌చ్చితంగా ప్రేక్షకుల మ‌న్నన‌ల‌ను పొందుతాడ‌నే ప్రగాఢ న‌మ్మకం నాకుంది. ఇలాంటి ఫ్రెష్ స‌బ్జెక్ట్స్ రావాలంటే ఫ్రెష్ థాట్స్ ఉండాలి. అలాంటి థాట్స్ డైరెక్టర్స్ ద‌గ్గరే ఉంటాయి. అలాంటి డైరెక్టర్ శ్రీ‌నివాస్ నాయుడు. మంచి క‌థ‌తో ఈ సినిమాని చ‌క్కగా డైరెక్ట్ చేశారు. శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ వాళ్లు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. నిర్మాత‌లు, ద‌ర్శకుడు, టెక్నీషియ‌న్స్, న‌టీన‌టుల‌ద‌రికీ నా ప్రత్యేక అభినంద‌న‌లు. ఆదికి ఈ సినిమా మంచి బ్రేక్ అవ్వాల‌నీ, మంచి విజ‌యం సాధించాల‌నీ ఆకాంక్షిస్తున్నా. మొత్తం సినిమా టీమ్‌కు ఆల్ ది బెస్ట్” అని అన్నారు. కాగా, ఈ సినిమాలో రాజీవ్ క‌న‌కాల‌, జ‌య‌ప్రకాష్‌, అజ‌య్‌, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా.. అరుణ్ చిలువేరు మ్యూజిక్ అందిస్తున్నాడు.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..