Allu Arjun: గోన గన్నారెడ్డి పాత్రను వదులుకున్న ఆ ఇద్దరు హీరోలు ఎవరో తెలుసా.. ? చివరకు అల్లు అర్జున్ చేతికి..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకులలో డైరెక్టర్ గుణేశేఖర్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర హిట్స్ తీశారు. చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో వర్క్ చేశారు. తక్కువ సమయంలోనే తెలుగు సినిమా ప్రపంచంలో తన మార్క్ క్రియేట్ చేశారు. ఆయన తెరకెక్కించిన చిత్రాల్లో రుద్రమదేవి ఒకటి.

డైరెక్టర్ గుణశేఖర్.. తెలుగు సినిమా ప్రేమికులకు పరిచయం అక్కర్లేని దర్శకుడు. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీశారు. సీనియర్ నుంచి యంగ్ హీరోల వరకు అనేక చిత్రాలను రూపొందించారు. భారీ సెట్స్ కు ప్రసిద్ధి చెందిన ఆయన.. అద్భుతమైన సినిమాలతో సినీరంగంలో తనదైన మార్క్ వేశారు. మెగాస్టార్ చిరంజీవితో చూడాలని ఉంది.. మహేష్ బాబుతో ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తీశారు. అలాగే వరుసగా మహేష్ బాబుతో మూడు సినిమాలు తీసి రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను రూపొందించిన ఆయన.. ఈమధ్యకాలంలో ఆయన అంతగా సినిమాలను రూపొందించడం లేదు. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రాల్లో రుద్రమదేవి ఒకటి. 2015లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ అక్టోబర్ 9వ తేదీతో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
రుద్రమదేవి చిత్రంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించగా.. రానా, అల్లు అర్జున్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మెయిన్ హైలెట్ అయిన గోనా గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన నటన అటు అభిమానులను, ఇటు ప్రేక్షకులను కట్టిపడేసింది. గోనా గన్నారెడ్డి పాత్రతో అల్లు అర్జున్ మరోసారి తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ పాత్రను ఇద్దరు తెలుగు స్టార్ హీరోస్ వదులుకున్నారని మీకు తెలుసా.. ? ఈ సినిమాలో గోనా గన్నారెడ్డి పాత్రను పోషించడానికి ఎన్టీఆర్, మహేష్ బాబు సైతం ఆసక్తి చూపించారని గతంలో గుణశేఖర్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
గుణశేఖర్ మాట్లాడుతూ.. రుద్రమదేవి సినిమా తీయడానికి స్పూర్తి ఇచ్చిన మూవీ బ్రేవ్ హార్ట్. ఆ స్పూర్తితోనే రుద్రమకథ చేయాలని నాకు అనిపించింది. కానీ దర్శకుడిగా నాకు మంచి మార్కెట్ ఉన్నప్పుడు చేయాలనుకున్నాను. ఒక్కడు తర్వాత దక్షిణాదిలో ఏ దర్శకుడు తీసుకోలేనంత పెద్ద పారితోషికాన్ని నాకు ఆఫర్ చేశారు. అప్పుడు రుద్రమదేవి చేయాలని నిశ్చయించుకుని పలువురు నిర్మాతలకు చెప్పాను. కాకతీయుల నేపథ్యంలో గుణశేఖర్ సినిమా అంటూ పేపర్ లో ప్రకటన వచ్చిందని.. ఆ తర్వాత హీరో ఓరియెంటెడ్ మూవీగా మార్చాలని అడగంతో కుదరదని ప్రాజెక్ట్ పక్కకు వెళ్లిపోయిందని అన్నారు. ఒక్కడు తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలనుకున్నానని.. కానీ కథ సరిగ్గా కుదరలేదనిపించిందని.. రుద్రమదేవి అనుకున్నప్పుడు ఎన్టీఆర్, మహేష్ పేర్లు వినిపించాయని అన్నారు. వాళ్లిద్దరూ నటించడానికి ఆసక్తి చూపించిన పరిస్థితులు సహకరించలేదని అన్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు, నిత్య మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..




