“సైరా’ ఫ్యాన్స్‌కి బంపర్‌ ఆఫర్‌..ఒక టికెట్‌ కొంటే రెండోది ఫ్రీ..

సైరా' ఫ్యాన్స్‌కి బంపర్‌ ఆఫర్‌..ఒక టికెట్‌ కొంటే రెండోది ఫ్రీ..

మెగాస్టార్‌ చిరంజీవి 151 చిత్రం “సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సైరా సినిమాలో హీరోయిన్లుగా నయనతార, తమన్నా, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కూడా సైరాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం అక్టోబర్‌ 2న అంటే గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అంటే అమెరికాలో అక్టోబర్ 1నే ప్రీమియర్ షోలు ఉంటాయి. అక్టోబర్ 1న మంగళవారం […]

Pardhasaradhi Peri

|

Sep 12, 2019 | 5:38 PM

మెగాస్టార్‌ చిరంజీవి 151 చిత్రం “సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సైరా సినిమాలో హీరోయిన్లుగా నయనతార, తమన్నా, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కూడా సైరాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం అక్టోబర్‌ 2న అంటే గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అంటే అమెరికాలో అక్టోబర్ 1నే ప్రీమియర్ షోలు ఉంటాయి. అక్టోబర్ 1న మంగళవారం కావడం.. అమెరికాలో సైరా సినిమాకు కాస్త అడ్వాంటేజ్‌గా మారనుంది. అమెరికాలో ప్రతి మంగళవారం పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు, యాప్స్‌ పలు ప్రత్యేక ఆఫర్లను ఇస్తుంటాయి. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటూ సినీ ప్రియులను ఆకట్టుకుంటుంటాయి. సరిగ్గా దీన్ని క్యాష్ చేసుకునేలా మన టాలీవుడ్ నిర్మాతలు.. సినిమాలను విడుదల చేస్తుంటారు. మంగళవారం అమెరికాలో విడుదలైన తెలుగు సినిమాల ఓవర్సీస్ కలెక్షన్లను గమనిస్తే. ఖైదీ నెంబర్ 150, అజ్ఞాతవాసి, స్పైడర్, గీత గోవిందం.. వంటి సినిమాలన్నీ మంగళవారం అమెరికాలో ప్రీమియర్ల ద్వారా విడుదలయ్యాయి. వీటిలో పవన్, మహేశ్ సినిమాలకు డివైడ్ టాక్ వచ్చినా.. ఓవర్సీస్ కలెక్షన్లలో దుమ్మురేపాయి. అందుకే పెద్ద సినిమాలను సరిగ్గా మంగళవారం విడుదలయ్యేట్లు నిర్మాతలు ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు చిరంజీవి సైరా నరసింహారెడ్డి కూడా అమెరికాలో మంగళవారమే విడుదలవబోతోంది. అమెరికాలో ప్రస్తుతం ఏటీ&టీ సంస్థ ఒక టికెట్ కొంటే.. మరో టికెట్ ఫ్రీ అనే ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu