ఆ ఒక్క సీనే సినిమాను మార్చేసింది.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్.. కుర్రాళ్లకు తెగ నచ్చిన సినిమా
కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. చిన్న సినిమాలుగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్ గానూ నిలిచాయి. అలాంటి సినిమాల్లో ఇది ఒకటి

ఇటీవల విడుదలైన సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా వరుసగా సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇటీవలే థియేటర్స్ లో విడుదలైన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ఇక కంటెంట్ ఉన్న సినిమాలు థియేటర్స్ లో మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఒక సినిమా విజయం సాధించాలంటే చాలా క్రాఫ్ట్స్ సాయం చేస్తుంటాయి. కొన్ని సినిమాలు మ్యూజిక్ కారణంగా హిట్ అవుతాయి. అలాగే మరికొన్ని సినిమాలు కేవలం హీరో క్రేజ్ వల్ల హిట్ అవుతుంటాయి. ఇంకొన్ని సినిమాలు ఒకే ఒక్క సీన్ వల్ల విజయం సాదిస్తుంటాయి. అవును ఎన్నో సూపర్ హిట్ సినిమాలు క్లైమాక్స్ వల్లే హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి.
చాలా సినిమాలు క్లైమాక్స్ కారణంగా హిట్ అయినవి మన చాలా దగ్గర చాలా ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కూడా అదే కోవకు వస్తుంది. ఆ సినిమా మరేదో కాదు తమిళ్, తెలుగులో తెరకెక్కిన 7/జి బృందావన్ కాలనీ. తమిళ్ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. యూత్ ను ముఖ్యంగా కుర్రాళ్లను ఆకట్టుకునే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సెల్వరాఘవన్. ఏ.ఎం. రత్నం కుమారుడు రవికృష్ణ హీరోగా నటించారు.. అలాగే సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా విడుదలైన సమయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. మొదట్లో మిక్స్డ్ టాక్ తో మొదలైన ఈ సినిమా ఆతర్వాత పాజిటివ్ గా మారిపోయింది. లాంగ్ లో రన్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అయితే యూత్ ను ఆకట్టుకునే లవ్ స్టోరీతో పాటు సినిమా క్లైమాక్స్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. చివరిలో హీరోయిన్ చనిపోవడంతో గుండెబరువెక్కుతుంది. ఆమె జ్ఞాపకాల్లో హీరో జీవించడం.. ఆమె కోరుకున్నట్టు జాబ్ తెచ్చుకోవడం.. చనిపోయినప్పటికీ ఆమె తనతోనే ఉందనుకుంటా హీరో ఆమె తో మాట్లాడటం ప్రేక్షకులను కట్టిపడేసింది. దాంతో సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళ్ళిపోయింది. ఈ సినిమా వచ్చి 22 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ మూవీ. ఈ సినిమాలోని సంగీతం, యువన్ శంకర్ రాజా అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
