Rajinikanth: ఓటీటీలోకి అడుగుపెట్టిన పెద్దన్న.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా రూపొందిన చిత్రం 'అన్నాత్తై'. తెలుగులో 'పెద్దన్న'గా విడుదలైంది. మాస్‌ డైరెక్టర్‌ శివ ఈ సినిమాను తెరకెక్కించారు..

Rajinikanth: ఓటీటీలోకి అడుగుపెట్టిన పెద్దన్న.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..


తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘అన్నాత్తై’. తెలుగులో ‘పెద్దన్న’గా విడుదలైంది. మాస్‌ డైరెక్టర్‌ శివ ఈ సినిమాను తెరకెక్కించారు. నయనతార హీరోయిన్‌గా, కీర్తి సురేశ్ రజనీ చెల్లెలిగా నటించార. మీనా, ఖుష్బూ, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దీపావళి కానుకగా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెద్దన్న’ అభిమానులతో పాటు సినిమా ప్రియులను బాగా అలరించాడు. కాగా ఇప్పుడు స్మాల్‌ స్ర్కీన్‌ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రముఖ ఓటీటీ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగుతో పాటు తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో బుధవారం రాత్రి నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. కాగా నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కులను దాదాపు రూ. 50 కోట్లకు దక్కించుకున్నట్టు సమాచారం. మరి థియేటర్లలో ‘పెద్దన్న’ను చూడని వారు ఎంచెక్కా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాని చూసి ఎంజాయ్‌ చేయండి. కాగా ‘అన్నాత్తై’ తర్వాత రజనీ నటించే సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల అనారోగ్యంతో మరోసారి ఆస్పత్రిలో చేరిన ఆయన ప్రస్తుతం ఇంటి దగ్గరే పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే తన కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్‌ వచ్చే అవకాశముంది.Also Read:

SS Rajamouli : ఆర్ఆర్ఆర్ సీన్ల‌ను లోతుగా చూస్తే ఎలా ఉంటుందో జ‌న‌ని పాట అలా ఉంటుంది : రాజమౌళి

Alia Bhatt: నెటిజన్ల మనసు గెల్చుకున్న అలియా.. అభిమానిని గుర్తు పెట్టుకుని పలకరించిన బాలీవుడ్‌ నటి..

Ananya Panday : లాస్‌ వేగాస్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న లైగర్‌.. ఫొటోలు షేర్‌ చేసిన అనన్య..

Click on your DTH Provider to Add TV9 Telugu