మొన్న సంక్రాంతికి అర్జున్.. వచ్చే పొంగల్‌కి చెర్రీ.. మహేష్ ఏం చేస్తాడో!

వచ్చే 2021 సినీ సంక్రాంతికి ఇప్పటి నుంచే హడావిడి షూరూ అయిపోయింది. ఈ సారి 2021కి గట్టి పొటీ నెలకొందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది అల్లు అర్జున్-మహేష్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇండస్ట్రీ హిట్ మాదంటే మాదని.. రెండు చిత్ర బృందాలు తెగ హడావిడి చేసేశాయి. సక్సెస్‌ మీట్‌లు, ఫంక్షన్లు అంటూ ఈ రెండు టీమ్స్‌ ఊర్లన్నీ తిరిగి సందడి చేశాయి. ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇక ముందు ఒక లెక్క […]

మొన్న సంక్రాంతికి అర్జున్.. వచ్చే పొంగల్‌కి చెర్రీ.. మహేష్ ఏం చేస్తాడో!

వచ్చే 2021 సినీ సంక్రాంతికి ఇప్పటి నుంచే హడావిడి షూరూ అయిపోయింది. ఈ సారి 2021కి గట్టి పొటీ నెలకొందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది అల్లు అర్జున్-మహేష్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇండస్ట్రీ హిట్ మాదంటే మాదని.. రెండు చిత్ర బృందాలు తెగ హడావిడి చేసేశాయి. సక్సెస్‌ మీట్‌లు, ఫంక్షన్లు అంటూ ఈ రెండు టీమ్స్‌ ఊర్లన్నీ తిరిగి సందడి చేశాయి. ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇక ముందు ఒక లెక్క అంటూ.. 2021 పొంగల్‌ మరింత స్పెషల్‌గా ఉండనుంది.

ఎందుకంటే.. 2021 సంక్రాంతికి టాప్‌ హీరోలందరూ వెండితెరపై కనిపించి హడావిడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ  రేస్‌లో  మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్‌లు ఉన్నారని వార్తలు ట్రోల్ అవుతున్నా.. ఇప్పుడు రామ్‌ చరణ్‌ కూడా నేనంటూ సిద్ధమైపోయాడు. ఇప్పుడే వచ్చిన.. ఆర్ఆర్ఆర్ సినిమా కొత్త అప్‌డేట్ ప్రకారం.. సంక్రాంతి రేసులో ఆ సినిమా ఉండబోతోందని స్పష్టమైపోయింది. దీంతో.. మిగతా సినిమాలకు టఫ్ ఫైట్ నెలకొనే ఛాన్స్‌ లేకపోలేదు. దానికి కారణం.. ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ బిగ్గెస్ట్ మూవీ. ఇప్పటికే అది ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని.. దాని కోసం ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. అందులోనూ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌లు పాతకాలం పాత్రల్లో కనిపిస్తున్నారు. దీంతో ఫ్యామిలీస్ కూడా ఆ సినిమా చూసేందుకు రెడీ అయిపోతాయి.

తాజాగా.. సరిలేరు నీవెవ్వరు సినిమాతో మంచి కమర్షియల్ హిట్ సాధించారు మహేష్. ఇక ఆ వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. జేమ్స్ బాండ్ అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఇందులో మహేష్ జేమ్స్ బాండ్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం. కాగా ఈ షూటింగ్ మే నెల్లో స్టార్ట్ కానుంది. ఇది వచ్చే న్యూ ఇయర్ సంక్రాంతి పోటీ బరిలో నిలుస్తుందని వంశీ తెలిపారు. దీంతో.. వచ్చే సంవత్సరం కూడా మహేష్‌ బాబుకి గట్టి పోటీ నెలకొందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ.. మహేష్, చెర్రీ, ఎన్టీఆర్‌లు బెస్ట్ ఫ్రెండ్స్. మరి వీరి కోసమైనా.. మహేష్ సంక్రాంతి రేసు నుంచి వెనక్కి తగ్గుతాడో లేదో చూడాలి.

Published On - 6:11 pm, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu